దేశంలో కొత్తగా 47,262 కేసులు

న్యూఢిల్లీ : దేశంలో మహమ్మారి ఏమాత్రం ఉధృతి తగ్గడం లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గడిచిన 24 గంటల్లో 47,262 పాజిటివ్ కేసులు రికారయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. అలాగే ఒకే రోజు పెద్ద ఎత్తున 275 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన మొత్తం కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,17,34,058కు పెరిగింది. మరో 23,907 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 1,12,05,160 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,68,457 యాక్టివ్ కేసులున్నాయని, మహమ్మారి ప్రభావంతో మొత్తం 1,60,441 మంది మృత్యువాతపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇప్పటి వరకు వ్యాక్సిన్ డ్రైవ్లో 5,08,41,286 డోసులు వేసినట్లు వివరించింది. ఇదిలా ఉండగా.. మంగళవారం దేశవ్యాప్తంగా 10,25,628 కొవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. నిన్నటి వరకు మొత్తం 23,64,38,861 నమూనాలను పరీక్షించినట్లు చెప్పింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

