వేపలగడ్డ పంచాయతీ భవనం ప్రారంభం
బూర్గంపహాడ్ మండల పరిధిలోని వేపలగడ్డ పంచాయతీలో రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పినపాక, అశ్వారావుపేట, ఇల్లెందు ఎమ్మెల్యేలు..
బూర్గంపహాడ్, నవంబర్ 25 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని వేపలగడ్డ పంచాయతీలో రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పినపాక, అశ్వారావుపేట, ఇల్లెందు ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ, కోరం కనకయ్య, కలెక్టర్ అంకిత్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్టలతో కలిసి బుధవారం ప్రారంభించారు. అదేవిధంగా పోలవరం గ్రామంలో రూ.12లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మారుమూల గిరిజన ప్రాంతమైన వేపలగడ్డలో అన్ని సౌకర్యాలతో పంచాయతీ భవనం నిర్మించుకోవడం సంతోషకరమన్నారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు అందించడం జరుగుతుందని, రూ.5 లక్షల ఇందిరమ్మ జీవిత బీమా ప్రతి కుటుంబానికి అందించడం జరుగుతుందన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా పినపాక నియోజకవర్గానికి సాగునీరు అందించాలని ఎమ్మెల్యే పాయం విజ్ఞప్తి చేయగా సాగునీటిని నియోజకవర్గంలోని ఆయా మండలాలకు సాగునీరు అందించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నిరోష, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వేపలగడ్డ పంచాయతీ భవనం ప్రారంభం
‘బూర్గంపహాడ్- ఇరవెండి రహదారి నిర్మాణం చేపట్టాలి’
Nagurla Venkateshwarlu | దాడికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలి : నాగుర్ల వెంకటేశ్వర్లు
Panchayat Elections | ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
దీక్షా దివస్‌ను విజయవంతం చేయండి : ఆర్.జె.సి.కృష్ణ
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

