న్యూఢిల్లీ : కత్రినా కైఫ్, సిద్ధార్ధ్ మల్హోత్రాల సాంగ్ కాలా చష్మా ఎంతగా హిట్ అయిందో తెలిసిందే. ఇదే సాంగ్ మరోసారి ఇన్‌స్టాగ్రాంలో దుమ్ము రేపుతోంది. 2018 నాటి ఈ పాటకు ఓ విద్యార్ధి తన కాన్వకేషన్ సందర్భంగా స్టేజ్‌పై చేసిన డ్యాన్స్ వీడియో అందరి హృదయాలనూ గెలుచుకుంటోంది.
మహిర్ మల్హోత్రా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. డిజిటల్ క్రియేటర్‌గా అతడు తన బయోలో తనను పరిచయం చేసుకున్నాడు. ఈ షార్ట్ క్లిప్‌లో మహిర్ తన గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకునే ముందు స్టైలిష్‌గా స్టెప్‌ను ఏకంగా స్టేజ్‌పై ప్రెజెంట్ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అందరూ చప్పట్లు కొడుతూ ప్రోత్సహిస్తుండగా స్టేజ్‌పై హుక్ స్టెప్‌తో అలరించాడు.
మీరు దీన్ని ప్రయత్నించకండి..నేను అలాంటి ప్రయత్నాన్ని ప్రోత్సహించనని పోస్ట్‌కు మహిర్ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఆన్లైన్ షేర్ చేసినప్పటి నుంచి 30 లక్షల మంది వరకూ వీక్షించారు. మీరు ఈ ట్రెండ్‌ను సొంతం చేసుకున్నారని ఓ యూజర్ ప్రశంసించగా మీ ధైర్యం మెచ్చకోదగినదని మరో యూజర్ కామెంట్ చేశాడు.