వర్క్ యాంగ్జయిటీ.. వద్దే వద్దు
గడువులు, లక్ష్యాలు, హెచ్చరికలు, నోటీసులు.. కార్పొరేట్ ఉద్యోగం కదనరంగాన్ని తలపిస్తుంది. ఏ కొంత వెనకబడినా.. ఒత్తిడి, ఆందోళన మొదలైపోతాయి.
గడువులు, లక్ష్యాలు, హెచ్చరికలు, నోటీసులు.. కార్పొరేట్ ఉద్యోగం కదనరంగాన్ని తలపిస్తుంది. ఏ కొంత వెనకబడినా.. ఒత్తిడి, ఆందోళన మొదలైపోతాయి. ఆఫీస్‌కు సకాలంలో చేరుకోవడం, ట్రాఫిక్ రద్దీ ఆందోళనకు గురిచేస్తాయి. కాస్ట్‌కటింగ్ కత్తి నెత్తిన వేలాడుతూనే ఉంటుంది. ఇలాంటి సమయంలో సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి.

1 సమస్యను విస్మరించొద్దు
సమస్యలు ఎదురుకాగానే చాలామంది ఎదుర్కోకుండా పారిపోతారు. దీంతో సమస్య సమస్యగానే మిగులుతుంది. మరింత జటిలం అవుతుంది. దీంతో మద్యం, ధూమపానం లాంటి అనారోగ్యకరమైన ఉపశమనాలను ఆశ్రయిస్తారు. ఇది పక్కా పలాయనవాదం. ‘నేను ఈ ప్రాజెక్టు పూర్తిచేయలేను.. నా ఉద్యోగం ఊడటం ఖాయం’ అని భయపడతారు. దీనికంటే పనిమీద దృష్టిపెట్టి… గతంలో అధిగమించిన సవాళ్లను గుర్తుతెచ్చుకోవడం ఉత్తమం. ఎవ రికి వారు ధైర్యం చెప్పుకోవాలి.

2 స్వీయ విమర్శ సరికాదు
పని మొదలుపెట్టినప్పుడు, ఆ పని సమర్థంగా పూర్తిచేయలేమనే ఆందోళన ఉన్నప్పుడు చాలామంది ‘నా వల్ల అవుతుందా? అసలు చేయగలనా?’.. అనే ఆత్మవిమర్శకు దిగుతారు. ఇది మహా చెడ్డ అలవాటు. మన సామర్థ్యం మీద మనకు అనుమానం ఉండకూడదు. ఇదంతా మనం అతిగా ఆలోచించడం వల్ల తలెత్తే సమస్య మాత్రమే. మంచి నిపుణుడిని సంప్రదించి సలహాలు తీసుకోవాలి. ఉద్యో గంలో నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి. బలహీనతలను అధిగమించాలి. అంతేతప్ప పని నుంచి పలాయనం చిత్తగించకూడదు.
3 మన గురించి మనం
పనిలో ఆందోళన మొదలవగానే మన గురించి మనం పట్టించుకోవడం మానేస్తాం. మన ప్రవర్తన కూడా మారిపోతుంది. చివరికి ‘చేస్తే చేస్తాం లేకపోతే లేదు… అయితే ఏం.. ఎవరేం చేసుకుంటారు?’ అనే నిర్లక్ష్యం స్థిరపడుతుంది. ఇలాంటప్పుడు మన బాగోగుల గురించి ఆలోచించాలి. తీవ్రమైన భావోద్వేగాలు, అధిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి సహచరుల మద్దతు తీసుకోవాలి. కాబట్టి పనే సర్వస్వం అనుకోకుండా మన గురించి మనం ఆలోచించుకోవాలి. పనిని జీవితాన్ని సమతూకం చేసుకోవాలి. మనల్ని సంతోషపెట్టే, ఉల్లాసంగా ఉంచే కార్యకలాపాలకూ సమయం కేటాయించుకోవాలి.
4 ప్రతికూల దృక్పథం వద్దు
నేటి ఉద్యోగాల్లో డెడ్లైన్లు, టార్గెట్లు, ఒత్తిడితో కూడిన వాతావరణం ఎక్కువ. దీంతో ప్రశాంతంగా, సానుకూల దృక్పథంతో మసలడం అత్యవసరం. పనిలో ఆందోళన చిహ్నాలను నిర్లక్ష్యం చేస్తే ఉద్యో గంలో ఉత్పాదకత తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి కంపెనీలు ఉద్యోగుల భయాలను తొలగించడం, వారితో కమ్యూనికేషన్ కొనసాగించడం, పని – జీవితం సరిహద్దులను స్పష్టంగా నిర్వచించడం, మానసిక ఆరోగ్య సదుపాయాల గురించి పట్టించుకోవాలి. ఉద్యోగుల సంక్షేమం, వారి పని ఆందోళనను పరిష్కరించగలిగే వాతావరణాన్ని సృష్టించాలి.

5 ఒంటరితనానికి
దూరంగా పనిలో ఆందోళన తలెత్తగానే చాలామంది వాళ్ల సహోద్యోగులు, దోస్తుల నుంచి దూరం జరుగుతారు. వాళ్లు తప్పుగా అర్థం చేసుకుంటారనో, అండగా నిలవరనో అపోహ పడతారు. కానీ, ఇలాంటప్పుడు మనకు నమ్మకమైన వాళ్లతో సమస్యను పంచుకోవడం, మానసిక నిపుణుల దగ్గర చికిత్స తీసుకోవడం పనిలో ఆందోళన తగ్గడానికి మంచి పరిష్కారాలు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

