హోనోలులు, అక్టోబర్ 27: గురుగ్రహం కంటే పెద్దదైన ఓ బేబీ ప్లానెట్ను (కొత్తగా ఏర్పడిన గ్రహం) హవాయి పరిశోధకులు తాజాగా గుర్తించారు. లక్షల ఏండ్ల క్రితం ఏర్పడిన ఓ నక్షత్రం చుట్టూ ఈ గ్రహం పరిభ్రమిస్తున్నదని పేర్కొన్నారు. ‘2ఎం0437బీ’గా పిలుస్తున్న ఈ గ్రహం కొత్తగా ఏర్పడటం వల్ల దాని ఉపరితల ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉన్నదన్నారు. హవాయి దీవుల్లోని క్లవువా అగ్నిపర్వతం నుంచి విడుదలయ్యే లావా ఉష్ణోగ్రతకు ఇది సమానంగా ఉన్నదని పేర్కొన్నారు. ఈ బేబీ ప్లానెట్‌పై మరింత లోతుగా పరిశోధన చేస్తే.. సౌర కుటుంబం ఆవిర్భావం, తొలినాళ్లలో భూమిపైనున్న పరిస్థితులను తెలుసుకోవచ్చన్నారు.