షార్జా: నల్లజాతీయులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా సాగుతున్న ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ (బీఎల్ఎం) ఉద్యమానికి సంఘీభావం తెలపకపోవడంపై దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ విచారం వ్యక్తం చేశాడు. తాను జాత్యాహంకారి (రేసిస్ట్)ని కాదని స్పష్టం చేశాడు. తన చర్యతో ఎవరైనా బాధపడితే క్షమించమని కోరాడు. మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు మోకాళ్లపై కూర్చొని సంఘీభావం తెలిపేందుకు నిరాకరించిన డికాక్.. ఆ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. దీంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో డికాక్ గురువారం స్పందిస్తూ.. ‘ఈ అంశంపై ఇంత చర్చ జరుగుతుందని అనుకోలేదు. నేను మోకాళ్లపై కూర్చుంటే.. కొందరి జీవితాలు బాగుపడతాయంటే అందుకు నేను సదా సిద్ధంగా ఉంటా. తదుపరి మ్యాచ్‌ల్లో సంఘీభావం తెలిపేందుకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మ్యాచ్‌కు ముందు బోర్డు ఇచ్చిన ఆదేశాలను తప్పుగా అర్ధం చేసుకున్నా. అవి నా హక్కులను హరించేలా అనిపించాయి. అందుకే విండీస్‌తో మ్యాచ్‌కు దూరమయ్యా. క్లిష్ట సమయంలో అండగా నిలిచిన కెప్టెన్ బవుమాతో పాటు ఇతర ఆటగాళ్లకు కృతజ్ఞతలు. జాత్యహంకారి అనే మాటలు నన్ను బాధపెట్టాయి. నాతో కలిసి ఆడిన వారికి నేను ఎలాంటి వాడినో బాగా తెలుసు. గందరగోళానికి తెరదించాలనే ఉద్దేశంతోనే వివరణ ఇస్తున్నా. నా చర్యల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించమని కోరుతున్నా’ అని పేర్కొన్నాడు.