Nepal Floods | నేపాల్ వరదల్లో హైదరాబాదీ గల్లంతు.. మానససరోవర్ వెళ్లివస్తూ అదృశ్యమైన మహిళ
Nepal Floods | నేపాల్ వరదల్లో హైదరాబాద్‌కు చెందిన శ్రీదేవి వేజెళ్ల గల్లంతైందని ఆమె భర్త దీపక్ తెలిపారు. కైలాస మానస సరోవర యాత్ర ముగించుకుని, తిరుగు ప్రయాణంలో ఉన్న తన భార్య వరదల్లో చిక్కుకుందని ఆయన అదివారం మీడియాకు తెలిపారు.
Nepal Floods | న్యూయార్క్/హైదరాబాద్, ఆగస్టు 30(నమస్తే తెలంగాణ): నేపాల్‌లో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో వరదల్లో చిక్కుకున్న 80 మంది ఇషా ఫౌండేషన్ సభ్యుల్లో హైదరాబాద్‌కు చెందిన తన భార్య శ్రీదేవి వేజెళ్ల కూడా ఉందని తెలిసి అమెరికా పౌరుడు, భారతీయ సంతతికి చెందిన దీపక్ దండు కన్నీటిపర్యంతమయ్యారు. వరదల అనంతరం ఆమెతో సంబంధాలు తెగిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆయన.. భార్య ఆచూకీ కోసం భారత్‌కు బయలుదేరారు.
దీపక్ దండు భార్య శ్రీదేవి వెజెల్లా కైలాస మానస సరోవర్ యాత్రలో పాల్గొన్నారు. యాత్ర ముగించుకుని భారత్‌కు తిరిగి వస్తున్న సమయంలో నేపాల్-టిబెట్ సరిహద్దులోని గ్యిరోంగ్ ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఈషా ఫౌండేషన్‌కు చెందిన బృందం ఉండగా భారీ వరద పోటెత్తింది. మట్టి, రాళ్లు, వరదనీరు ఒక్కసారిగా ఇమ్మిగ్రేషన్ భవనాన్ని చుట్టుముట్టి కొట్టుకుపోయినట్లు సమాచారం.
శ్రీదేవితో మంగళవారం వరకు తాను నిరంతరం మాట్లాడుతూనే ఉన్నానని దీపక్ దండు తెలిపారు. ఆమె తిరుగు ప్రయాణంలో ఉన్నట్లు చివరిసారిగా తనకు సమాచారం ఇచ్చిందన్నారు. ఆ తర్వాత నుంచి ఆమె ఫోన్ పనిచేయకపోవడంతో ఆందోళన మరింత పెరిగిందని చెప్పారు.
శ్రీదేవి, దీపక్ దండు దంపతులకు 13 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. శ్రీదేవితో కలిసి అతడు హైదరాబాద్‌కు వచ్చినప్పటికీ కుటుంబ సభ్యుల వద్దే ఉండిపోయాడు. ప్రస్తుతం తన కుమారుడు కూడా వార్తలు విని తీవ్రంగా కలత చెందుతున్నాడని దీపక్ తెలిపారు. తన భార్యకు కైలాస మానస సరోవర్ యాత్ర చేయాలన్నది ఎన్నాళ్ల నుంచో ఉన్న కోరిక అని దీపక్ కన్నీటిపర్యంతమవుతూ చెప్పారు. ‘‘ఆమెతో కలిసి నేనూ యాత్రకు రావాల్సింది. కానీ వీలు కాలేదని’’ పేర్కొన్నారు.
శ్రీదేవి ఆచూకీ కోసం న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్. కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరినట్లు తెలిపారు. కుమారుడికి అండగా ఉండటంతో పాటు భార్య గురించి సమాచారం తెలుసుకునేందుకు భారత్‌కు వస్తున్నట్లు వెల్లడించారు.
ప్రమాదం జరిగిన సమయంలో శ్రీదేవి ఇమ్మిగ్రేషన్ భవనం లోపలే ఉన్నారని, వరదలకు ఆ భవనం పూర్తిగా ధ్వంసమైందన్నారు. భారీ యం త్రాలతో ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని దీపక్ తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cult | ‘కల్ట్’ రిలీజ్ ట్రైలర్.. రక్తపాతం, భయంకరమైన హత్యలతో విశ్వక్ సేన్ విశ్వరూపం!
ISRO | మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. శుక్రవారం రాత్రి నింగిలోకి దూసుకెళ్లనున్న జీఎస్సెల్వీ-ఎఫ్18..!
Sri Venkateswara Creations | భారీ సాహసానికి పూనుకున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. ఒకేసారి నాలుగు క్రేజీ చిత్రాల డిస్ట్రిబ్యూషన్!
Jailer 2 | ‘జైలర్ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా .. నవంబర్ 12 నుంచే స్ట్రీమింగ్ అంటూ ప్రచారం!
Pocket Rockets | నిహారిక కొణిదెల నిర్మాణంలో నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

