Hyderabad to Nagarjuna Sagar Tour | రూ. 800కే నాగార్జున సాగర్ ట్రిప్.. తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీ
Hyderabad to Nagarjuna Sagar Tour | ఈ వీకెండ్లో హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లాలనుకునే పర్యాటకుల కోసం తెలంగాణ టూరిజం (Telangana Tourism) ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.
Hyderabad to Nagarjuna Sagar Tour | ఈ వీకెండ్లో హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లాలనుకునే పర్యాటకుల కోసం తెలంగాణ టూరిజం (Telangana Tourism) ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్‌కు ఒక రోజు టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు పూర్తి వివరాలను ప్రకటించింది. తెలంగాణ టూరిజం అధికారిక వెబ్సైట్(Official website) లో ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.
నాగార్జున సాగర్ టూర్ (Nagarjuna sagar Tour) పేరుతో తెలంగాణ టూరిజం ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోండగా.. ప్రతి శనివారం, ఆదివారం ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో నాగార్జున సాగర్ డ్యామ్ (Nagarjuna Sagar Dam), బోటింగ్ (Sagar Boating), మ్యూజియం (Nagarjuna Museum), నాగార్జునకొండ (Nagarjunakonda), బుద్దవనం ప్రాజెక్ట్ (Buddavanam Project) తదితర పర్యాటక ప్రాంతాలు సందర్శించవచ్చు.
సాగర్ టూర్ ప్రయాణం సాగుతుంది ఇలా
ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ పర్యాటక భవన్ నుండి, 8 గంటలకు బషీర్ బాగ్ నుండి నాగార్జునసాగర్‌కు బస్సు బయలుదేరుతుంది. ఉదయం 11:30 గంటలకి నాగార్జున సాగర్‌కు చేరుకుంటారు. ఉదయం 11:40 గంటలకు బుద్దవనం ప్రాజెక్ట్ (Buddavanam Project) సందర్శన.. తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. అనంతరం నాగార్జునకొండ (Nagarjunakonda)కు లాంచీలో ప్రయాణం ఉంటుంది. అక్కడ నాగార్జున సాగర్ మ్యూజియం, నాగార్జునకొండ సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ డ్యామ్ సందర్శన ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు నాగార్జున సాగర్ నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
హైదరాబాద్ టూ నాగార్జున సాగర్ టూర్ ప్యాకేజీ ధర
Hyderabad to Kaleshwaram Tour cost | (నాన్ ఏసీ బస్సు) పెద్దలకు రూ.800, పిల్లలు (5 నుంచి 12సంవత్సరాలు) రూ.640 చెల్లించాల్సి ఉంటుంది. ఇక టూర్ ప్యాకేజీలో బుద్దవనం ప్రాజెక్ట్, నాగార్జున సాగర్ మ్యూజియం, నాగార్జునకొండ, నాగార్జున సాగర్ డ్యామ్, కవర్ అవుతాయి.
గమనిక: ఆహారం, ఇతర ఖర్చులు పర్యాటకులే భరించాలి
పూర్తి వివరాల కోసం.. telangana tourism వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

