రియల్ ఢమాల్
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మారెట్ లో హైదరాబాద్, మేడ్చల్-మలాజి గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలతో కూడిన ప్రాంతం సెప్టెంబర్ 2026 నాటికి పరిస్థితి ఎంత దిగజారిందో ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.
-
సరార్ తీరుతో అస్తవ్యస్తంగా స్థిరాస్తి వ్యాపారం
-
ఒక్క నెలలోనే తగ్గిన 15% రిజిస్ట్రేషన్లు
-
నైట్ ఫ్రాంక్ నివేదికలో వెల్లడి
బీఆర్ఎస్ హయాంలో కళకళలాడిన నగర ‘రియల్ రంగం’ కాంగ్రెస్ పాలనలో అధ్వానంగా మారింది. రేవంత్ సర్కార్ విధానాలు, అనాలోచిత నిర్ణయాలు ఈ రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతిశాయి. పాలకుల చేతకానితనం కారణంగా సామాన్యుల సొంతింటి కల కలగానే మిగులుతున్నది. రియల్ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని.. తాజాగా వెలువడిన నైట్ ఫ్రాంక్ నివేదిక గణాంకాలే చెబుతున్నాయి. రేవంత్ సరార్ పోకడలతో రాష్ట్ర ఆర్థిక శాఖకు రైలు ఇంజిన్ లాంటి స్థిరాస్తి వ్యాపారం నిర్వీర్యమైపోతున్నది. సరైన రోడ్ మ్యాప్ లేకపోవడంతోనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సిటీబ్యూరో, నవంబర్ 11(నమస్తే తెలంగాణ)..హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మారెట్ లో హైదరాబాద్, మేడ్చల్-మలాజి గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలతో కూడిన ప్రాంతం సెప్టెంబర్ 2026 నాటికి పరిస్థితి ఎంత దిగజారిందో ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ 2025లో ఏకంగా 6,612 ప్రాపర్టీలు రిజిస్టర్ కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ 2026 నాటికి ఆ సంఖ్య 15% పడిపోయి కేవలం 5,620 యూనిట్లకు దిగజారింది. ఇక రిజిస్ట్రేషన్ల విలువ కూడా భారీగా క్షీణించింది. 2025 సెప్టెంబర్‌లో రూ.4,804 కోట్లుగా ఉన్న లావాదేవీల విలువ, సెప్టెంబర్ 2026 నాటికి 7% తగ్గి రూ.4,487 కోట్లకు పడిపోయింది. ఆగస్టు 2026తో పోలిస్తే కూడా (5,937 యూనిట్లు) సెప్టెంబర్‌లో రిజిస్ట్రేషన్లు మరో 5% క్షీణించడం ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతున్నాయి.
ప్రభుత్వ విధానాలపై రియల్టర్ల మండిపాటు
కాంగ్రెస్ సరార్ అధికారంలోకి వచ్చాక తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు, రియల్ రంగాన్ని ప్రోత్సహించడంలో చూపిస్తున్న నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు కరిగిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మేలొని, రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆదుకోవడానికి అవసరమైన విధానపరమైన చర్యలు తీసుకోవాలని, లేదంటే రాబోయే రోజుల్లో ఆర్థిక వ్యవస్థను తలకిందులు చేసే స్థాయిలో రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలోకి కూరుకుపోతుందని హెచ్చరిస్తున్నారు.
సామాన్యుడిపై తీవ్ర ప్రభావం
కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ ఆస్తులకు విలువ లేకుండా చేయడంతో సామాన్యుల కొనుగోలు శక్తి పడిపోవడంతో సెప్టెంబర్ 2026లో అన్ని వర్గాల ఇండ్ల రిజిస్ట్రేషన్లు పడిపోయాయి. రూ.50 లక్షల లోపు గృహాలు ఈ సెగ్మెంట్లో ఏకంగా 20% క్షీణత నమోదైంది. సామాన్యులు ఇల్లు కొనే పరిస్థితి లేకుండా పోయింది. రూ.50 లక్షల నుండి రూ.1 కోటి ఇండ్ల సెగ్మెంట్లో రిజిస్ట్రేషన్లు 6% తగ్గాయి. రూ. 1కోటికి పైబడిన ప్రీమియం ఇండ్లు ఈ సెగ్మెంట్లోనూ 12% క్షీణించాయి. మొత్తంగా చూస్తే భూముల ధరల సవరణల పేరుతో ప్రభుత్వం తెచ్చిన విధ్వంసకరమైన విధానాలు, ప్రజలపై రుద్దుతున్న అదనపు భారాల వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో అనిశ్చితి నెలకొందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

