వేర్‌హౌజింగ్, లాజిస్టిక్స్‌కు హైదరాబాదే అడ్డా
వేర్‌హౌజింగ్, లాజిస్టిక్స్ రంగాల్లో దక్షిణాదిలో హైదరాబాద్ నగరం పరుగులు పెడుతున్నది. హైదరాబాద్‌తోపాటు ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, చెన్నై, పుణె, కోల్‌కతాల్లో వేర్‌హౌజింగ్, లాజిస్టిక్స్ లీజింగ్ తీరుతెన్నులపై అమెరికన్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ వెస్టియన్ ఓ తాజా నివేదికను విడుదల చేసింది.
- క్యూ3లో జోరుగా స్థలాల లీజింగ్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): వేర్‌హౌజింగ్, లాజిస్టిక్స్ రంగాల్లో దక్షిణాదిలో హైదరాబాద్ నగరం పరుగులు పెడుతున్నది. హైదరాబాద్‌తోపాటు ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, చెన్నై, పుణె, కోల్‌కతాల్లో వేర్‌హౌజింగ్, లాజిస్టిక్స్ లీజింగ్ తీరుతెన్నులపై అమెరికన్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ వెస్టియన్ ఓ తాజా నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ3)లో ఈ ఏడు నగరాల్లో 7.55 మిలియన్ చదరపు అడుగుల మేర వేర్‌హౌజింగ్, లాజిస్టిక్స్ స్పేస్ లీజింగ్ జరిగింది. ఇందులో తొలి మూడు స్థానాల్లో ముంబై, పుణె, హైదరాబాద్ నిలిచాయి. మొత్తం లీజుల్లో ఈ మూడు నగరాల వాటానే 65 శాతం కావడం గమనార్హం. 24 శాతంతో ముంబై అగ్రస్థానంలో ఉండగా, పుణె (21 శాతం), హైదరాబాద్ (20 శాతం) తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. ఇక అద్దెల్లోనూ నిరుడు లావాదేవీలతో పోల్చితే హైదరాబాద్ ఈ ఏడాది సగటున 16 శాతం పెరుగుదలను నమోదు చేసింది.
ఈ విషయంలో పుణె, చెన్నైలు హైదరాబాద్ తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఈ నగరాల్లో 15 శాతం, 12 శాతం వృద్ధి కనిపించింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, అవలంభిస్తున్న వ్యాపార, పారిశ్రామిక స్నేహపూరిత విధానాలు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో వేర్‌హౌజింగ్, లాజిస్టిక్స్ రంగాల అభివృద్ధికి దన్నుగా నిలుస్తున్నాయి. దీంతో వేర్‌హౌజింగ్, లాజిస్టిక్స్ స్పేస్ లీజింగ్ హైదరాబాద్‌లో క్రమేణా పెరుగుతున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

