Hyderabad |ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనంతరం హైదరాబాద్ నగరం అనూహ్య రీతిలో అభివృద్ధి చెందుతున్నది. గ్లోబల్ సిటీకి ఏమాత్రం తీసిపోని విధంగా మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాయి. మెరుగైన రోడ్లు, ప్రణాళికాబద్ధమైన భవన నిర్మాణ రంగం, మెరుగైన రవాణా సదుపాయాలతోపాటు, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఎన్నో అవకాశాలు ఏర్పడ్డాయి. ఐటీ రంగంలో పెట్టుబడులకు దీటుగా అంతర్జాతీయ స్థాయి కంపెనీల రాకతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రెండింతలు పెరిగాయి.
కేవలం ఐటీ రంగానికే తెలంగాణ పురోభివృద్ధి పరిమితం కాకుండా అన్ని రంగాలకు విస్తరించింది. ఇలా అన్ని వ్యవస్థలు బలోపేతం కావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యే సంక్షోభాల ప్రభావాన్ని సమర్థవంతంగా తట్టుకోగలదు. దీంతో సుస్థిరమైన ఉపాధి, అవకాశాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా రాష్ట్రం ఆర్థిక పురోగతి దిశగా దూసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది.
– ప్రతిభ పులిజాల, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఈ స్కూల్, ఫౌండర్