కొవిడ్ నిబంధనల పాటింపుపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్ : కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నగర ప్రజల అవగాహన నిమిత్తం మంగళవారం ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. పౌరులు మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి అన్ని జాత్రత్త చర్యలను పాటించాల్సిందిగా సూచించారు. ఇతర రాష్ర్టాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మనం ముందస్తు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఫేస్ మాస్కులు ధరించని వారిపై కేసులు నమోదు చేయడం ప్రారంభించినట్లు తెలిపారు.
నగరంలోని కోఠి, ఇందర్‌బాగ్, సుల్తాన్ బజార్, నాంపల్లి, చార్మినార్, అబిడ్ రోడ్, సికింద్రాబాద్, మలక్‌పేట, మోహదీపట్నం ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా నియమాలు ఉల్లంఘించిన పలువురిపై పోలీసు అధికారులు కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. సాలార్జంగ్ బ్రిడ్జి వద్ద మిర్చౌక్ ట్రాఫిక్ పోలీసులు దాదాపు 100 ఫేస్ మాస్కులను ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇటువంటి చర్యలనే నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సిబ్బంది ఫేస్ మాస్కులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

