Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డిర్ కే వెంకటేశన్.. ఆదివారం లాస్ ఏంజిల్స్‌లో జరిగిన మిస్టర్ నేచురల్ వరల్డ్ బాడీబిల్డింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ గెలిచాడు. శాఖాహారి అయిన వెంకటేశన్.. స్వర్ణ పతకం గెలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ టుడేతో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్: హైదరాబాదీ బాడీబిల్డిర్ కే వెంకటేశన్(Bodybuilder Venkatesan).. ఆదివారం లాస్ ఏంజిల్స్‌లో జరిగిన మిస్టర్ నేచురల్ వరల్డ్ బాడీబిల్డింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ గెలిచాడు. శాఖాహారి అయిన వెంకటేశన్.. స్వర్ణ పతకం గెలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ టుడేతో ఆయన మాట్లాడారు. గత ఏడాది కూడా స్వర్ణ పతకాన్ని గెలిచినట్లు ఈ సందర్భంగా 49 ఏళ్ల బాడీబిల్డర్ వెంకటేశన్ గుర్తు చేశారు. ప్రతి బాడీ బిల్డింగ్ పోటీ ఓ సవాల్ అని, ఇది కూడా అలాంటిదే అని, తాజా ఈవెంట్ చాలా ఎనర్జిటిక్‌గా జరిగిందని, కాంపిటీషన్లో ప్రతి ఒక్కరూ తీవ్ర పోటీ ఇచ్చారని వెంకటేశన్ తెలిపారు. జూబ్లీ హిల్స్‌లో ఉన్న వన్ ఫిట్నెస్ స్టూడియో కో-ఓనర్ మిస్టర్ కుమార్ మన్నావాకు వెంకటేశన్ కృతజ్ఞతలు తెలిపారు. నూరు శాతం శాఖాహార బాడీబిల్డర్ అని, ఆ దీక్ష, క్రమశిక్షణ, నిరంతర శ్రమను ప్రదర్శించడం వల్ల తన ఫిట్నెస్ సాధించినట్లు చెప్పారు.
వృక్ష ఆధారిత జీవనశైలితోనూ మన ఫిట్నెస్ లక్ష్యాలను సాధించవచ్చు అని వెంకటేశన్ తెలిపారు. శాఖాహారిగా బాడీ బిల్డింగ్‌ను కొనసాగించడం చాలా కష్టమైన అంశమని, కానీ బాడీ బిల్డింగ్ కేవలం తన హాబీ మాత్రమే కాదు అని, అది నా ప్యాషన్, లైఫ్ స్టయిల్ అని వెంకటేశన్ తెలిపారు. డబ్బు కోసమో, పేరు కోసం ఈ పోటీల్లో పాల్గొనలేదని, బాడీ బిల్డింగ్‌ను ఇష్టపడుతానని, ఆ అనుభవం అమోఘమైందని, ప్రతి ఏడాది తనకు తానే ఛాలెంజ్ విసురుకుంటానన్నారు. కఠిన శ్రమ, సహనం, క్రమశిక్షణ, నమ్మకం వల్లే తాను పతకాన్ని గెలుచుకోగలిగినట్లు చెప్పారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | పెద్ద నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
Demonte Colony 3 | సూపర్ న్యాచురల్ హార్రర్ థ్రిల్లర్ ‘డెమోంటే కాలనీ 3’ ఆన్ ది వే
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

