వందేండ్లు..వర్ధిల్లు !!
- ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
- పలు చోట్ల రక్తదాన శిబిరాలు.. పండ్లు పంపిణీ
- మరికొన్ని చోట్ల కేక్‌కట్ చేసి సంబురాలు
- సీఎం పేరిట పలు ఆలయాల్లో పూజలు, అర్చనలు
- పాల్గొన్న ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు
ఉప్పల్జోన్ బృందం, ఫిబ్రవరి 17: సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు, అభిమానులు గురువారం ఘనంగా నిర్వహించారు.నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు, వృద్ధాశ్రమాలు, అనాథశ్రమాల్లో పండ్లు పంపిణీ చేపట్టారు. పలు డివిజన్లలో సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేక్‌లను కట్ చేశారు.
- హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, హబ్సిగూడ మాజీ కార్పొరేటర్ స్వప్నారెడ్డి హాజరైనారు. అనంతరం కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. పార్టీ సీనియర్ నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు డా.బీవీ.చారి, సుధాకర్, సోమిరెడ్డి, గోపాల్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీధర్, జేసీబీ రాజు పాల్గొన్నారు.
- నాచారం డివిజన్లో సర్వమత ప్రార్థనలు చేసి, సీఎం కేసీఆర్‌కు ఆశీర్వాదం అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై కేక్ కట్ చేసి, సర్వమత ప్రార్థ్ధనల్లో పాల్గొన్నారు.కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ముత్యంరెడ్డి,రవీందర్‌రెడ్డి, యాదగిరి, భూపాల్‌రెడ్డి, డివిజన్ ప్ర ధాన కార్యదర్శి అంజి, విఠల్‌యాదవ్, తిరుపతి ఉన్నారు.
- చిలుకానగర్ డివిజన్లోని ఆదర్శనగర్‌లో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే బేతి, కార్పొరేటర్ గీతాప్రవీణ్ ముదిరాజ్ హాజరై కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు.
- మల్లాపూర్ డివిజన్ టీఆర్ఎస్ నేత లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నందీశ్వర ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే, కార్పొరేటర్ దేవేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో కిరణ్‌కుమార్‌రెడ్డి, వాసుగౌడ్ పాల్గొన్నారు.సాధన మానసిక వికలాంగుల పాఠశాలలో లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.
- కాప్రా డివిజన్ వార్డు కార్యాలయంలో కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని కార్పొరేటర్ స్వర్ణరాజు, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. మీర్పేట్ హెచ్‌బీకాలనీ డివిజన్ వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ జి. శ్రీనివాస్‌రెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం అనాథాశ్రమంలో టీఆర్ఎస్ నేత రవి ఆధ్వర్యంలో కార్పొరేటర్ ప్రభుదాసు పండ్లు పంపిణీ చేశారు.
- చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ బస్టాప్‌లో అరుంధతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి కేక్ కట్ చేసి సర్వమత ప్రార్థ్ధనలో పాల్గొన్ని మొక్కలు నాటారు. కార్యక్రమంలో కుషాయిగూడ ఇన్స్పెక్టర్ మన్మోహన్, ఎస్సై ఉపేందర్‌యాదవ్, అరుంధతి సంక్షేమ సంఘం ఆధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్, చంద్రమౌళి, సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షుడు గిరిబాబు, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, పద్మారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, రెడ్డినాయక్, వెంకటేశ్, బాబు, ఎస్కే.కరీం, సర్ఫ్రాజు పాల్గొన్నారు.
- చక్రీపురం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీదేవి కేక్ కట్ చేశారు. అనంతరం విద్యామారుతి కాలనీలో మొక్కలు నాటారు. కార్యక్రమం లో నాయకులు బాల్‌రెడ్డి, విద్యసాగర్,ప్రభుగౌడ్, బాబు గంగపుత్ర, శ్రీకాంత్‌యాదవ్, సయ్యద్‌అలీ, సాయిబాబా గౌడ్, రమేశ్, సురేశ్, నజీర్, నర్సిరెడ్డి, మల్లయ్య, సుధాకర్, మల్లేశ్, వినోద్, సంపత్, యాదగిరి, ప్రసాద్, సతీశ్చంద్రా, స్వప్ణ, లత పాల్గొన్నారు.
- ఏఎస్‌రావునగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కాసం మహిపాల్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ రామారావు ఆధ్వర్యంలో రాధిక చౌరస్తాలో సీఎం కేసీఆర్ ప్లకార్డులతో ఉరేగింపు నిర్వహించి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి కుమార్‌స్వామి, నాయకులు బాల్‌రాజు, సుదర్శన్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, సీతారామిరెడ్డి, మంజుల, గిరి, శిరీషారెడ్డి, సదాలక్ష్మి, యాకయ్య, రాజిరెడ్డి, కృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీను, కృష్ణ, వెంకటరాజు, శంకరయ్య పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

