కోవిడ్ లాక్డౌన్: గుర్రం అంత్యక్రియలకు వందల మంది హాజరు, 14 రోజులపాటు గ్రామం దిగ్బంధం

న్యూఢిల్లీ: కర్నాటకలో ఓవైపు కరోనా ఉగ్రరూపం దాలుస్తున్నది. లాక్డౌన్ జూన్ 7 వరకు పొడిగించారు. అయినా జనాలు లాక్డౌన్కు మారో గోలి అంటున్నారు. బెళగావిలో ఆదివారం వందలాది మంది లాక్డౌన్ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఓ గుర్రం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బెళగావి లోని మరడీమఠ్ ప్రాంతంలో ఇది జరిగింది. గుర్రం అంతిమయాత్రపై ఏఎన్ఐ వార్తాసంస్థ విడుదల చేసిన వీడియో చూస్తే ఎవరికైనా ‘బాప్రే’ అనిపించక మానదు. అనేకమంది మాస్కులు కూడా పెట్టుకోలేదు. సామాజిక దూరం పాటించలేదు. మస్త్ మరడి గ్రామంలో ఓ మత సంస్థకు చెందిన గుర్రం ఆదివారం ఉదయం మరణించిందని, గ్రామప్రజలంతా గుర్రం కళేబరాన్ని భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకువెళ్లి దహనం చేశారని బెళగావి జిల్లా ఎస్పీ లక్ష్మణ్ నింబర్గీ తెలిపారు. కరోనా నిబంధనల ఉల్లంఘనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన అనంతరం 14 రోజుల పాటు ఊళ్లోకి రాకపోకలను నిషేధించారు. ప్రస్తుతం ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
#WATCH Hundreds of people were seen at the funeral of a horse in the Maradimath area of Belagavi, yesterday, in violation of current COVID19 restrictions in force in Karnataka pic.twitter.com/O3tdIUNaBN— ANI (@ANI) May 24, 2021
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

