వయసుకు మించిన బరువు.. పాప బరువు తగ్గేదెలా?
పిల్లల ఆహారం, ఎదుగుదల, ఆరోగ్యం గురించి తల్లిదండ్రులు ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు, ఆరోగ్యమైన పిల్లలు ఎంత బరువుండాలి వంటి విషయాల్లో డాక్టర్ సలహాలు సూచనలు..
మా పాపకు పదేండ్లు. ఎత్తు నాలుగు అడుగుల మూడు అంగుళాలు. బరువు 45 కేజీలు. నిజానికి కొవిడ్‌కు ముందు తను సాధారణంగానే ఉండేది. లాక్డౌన్ తర్వాత క్రమంగా లావు పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు వయసుకు మించిన బరువుతో ఇబ్బంది పడుతున్నది. ఇలా అయితే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు వస్తాయని భయంగా ఉంది. మీ సలహా చెప్పండి.
– ఓ పాఠకురాలు
చాలామంది పిల్లలు వయసుకు మించి బరువు ఉంటున్నారు. మీరు చెప్పింది నిజమే. ఊబకాయం వల్ల పిల్లలకు భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే వాళ్లు టీవీలు, సెల్ఫోన్లకు అతుక్కుపోకుండా చూసుకోవాలి. క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. రోజూ ఓ గంట ఆడుకునేలా చూడాలి. ఆసక్తి ఉంటే డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించండి. పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయం గడపండి. అధిక బరువు పిల్లలు పాఠశాలలో అవహేళనకు గురవుతుంటారు. దీనివల్ల మానసికంగా కుంగిపోతారు. ఆ ఒత్తిడిలో ఎక్కువగా తినేస్తుంటారు.
కన్నవారిగా పిల్లలు తమ ఆలోచనలను చెప్పుకొనే స్వేచ్ఛ ఇవ్వాలి. మరో ముఖ్య విషయం.. మీరు ఏం తింటే పిల్లలూ అదే తింటారు. అందుకే మీరు కూడా ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోండి. అదే పిల్లలకూ పెట్టండి. వాటిలోని పోషకాల గురించి కూడా చెప్పండి. కుటుంబం మొత్తం జంక్‌ఫుడ్, మైదాకు దూరంగా ఉండాలనే తీర్మానం చేసుకోండి. చిన్నారులకు సంక్లిష్ట కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఇవ్వండి. సజ్జలు, రాగులు, జొన్నలు, బ్రౌన్రైస్లాంటి వాటిలో ఇవన్నీ ఉంటాయి. ఎదిగే పిల్లలకు ప్రొటీన్ కూడా ముఖ్యమే. శాకాహారులైతే సోయా, పనీర్ లాంటివి; మాంసాహారులైతే గుడ్డు, మాంసం, చేపల్లాంటివి ఇవ్వాలి.
– మయూరి ఆవుల
న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- 10 year old
- kid
- Reduce
- weight
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

