e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, April 23, 2021
Advertisement
Home News పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవ‌డం ఎలా

పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవ‌డం ఎలా

పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవ‌డం ఎలా

చాలామంది ఉద్యోగుల‌కు పీఎఫ్ డ‌బ్బులే భ‌రోసా.. రిటైర్మెంట్ త‌ర్వాత ఆ డ‌బ్బులే వారికి ఆస‌రా. అందుకే ఉద్యోగులు త‌మ భ‌విష్య నిధి(పీఎఫ్‌) డ‌బ్బుల‌ను చివ‌రి వ‌ర‌కు త‌మ ఖాతా నుంచి తీయ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. పైగా పీఎఫ్ ఖాతాలో డ‌బ్బుల‌కు వ‌డ్డీ కూడా ఎక్కువ వ‌స్తుండ‌టంతో ఆ సొమ్మును అలాగే ఉంచేస్తారు. కానీ ప్ర‌తి ఏడాది త‌మ ఖాతాలో వార్షిక వ‌డ్డీ ఎంత జ‌మ అవుతుంది? దాన్ని ఎలా చెక్‌చేసుకోవాలో చాలామందికి తెలియ‌దు. త‌మ పీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ చెక్ చేసుకోవ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం నాలుగు మార్గాల‌ను అందుబాటులో ఉంచింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

వెబ్ సైట్ లో లాగిన్ అవ్వడం ద్వారా..

– ముందుగా ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్(www.epfindia.gov.in) ఓపెన్ చేయాలి. ఆ త‌ర్వాత ఈ-పాస్‌బుక్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.

– ఈ పాస్‌బుక్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయ‌గానే కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఆ కొత్త పేజిలో UAN నంబ‌ర్‌, పాస్‌వ‌ర్డ్‌తో లాగిన్ అవ్వాలి.

– లాగిన్ అవ్వ‌గానే మ‌న ఖాతాలో ఉన్న ప్రావిడెంట్ ఫండ్ మొత్తం, వ‌డ్డీ మొత్తానికి సంబంధించిన వివ‌రాలు క‌నిపిస్తాయి.  ఈ వివ‌రాల‌ను Pdf ఫార్మాట్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకునే స‌దుపాయం ఉంది.

ఉమంగ్ యాప్ ద్వారా..

– పీఎఫ్ ఖాతా వివ‌రాలు తెలుసుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఉమంగ్ అనే యాప్‌ను కూడా అందుబాటులో ఉంచింది. ప్లే స్టోర్‌, యాపిల్ యాప్‌ స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న త‌ర్వాత UAN వివ‌రాల‌తో లాగిన్ అయి ఈపీఎఫ్‌వో ఖాతాలో ఉన్న మొత్తం గురించి వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు.

పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవ‌డం ఎలా

మిస్డ్ కాల్ ద్వారా..

ఈపీఎఫ్‌వో ఖాతాదారులు త‌మ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్ నుంచి మిస్డ్ కాల్ ఇచ్చి పీఎఫ్ ఖాతాలోని బ్యాలెన్స్ చెక్ చేసుకోవ‌చ్చు. ఖాతాదారులు త‌మ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నుంచి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. పీఎఫ్ నంబ‌ర్ స‌హా.. ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉంది.. వ‌డ్డీ మొత్తం ఎంత అన్న వివ‌రాల‌తో కూడా మెసేజ్ వెంట‌నే మీ ఫోన్‌కు వ‌స్తుంది.

ఎస్ఎంఎస్ ద్వారా..

పీఎఫ్ అకౌంట్‌కు, బ్యాంక్ ఖాతాకు ఒకే మొబైల్ నంబ‌ర్ అనుసంధాన‌మై ఉండి.. అదే నంబ‌ర్ ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌లో కూడా అప్‌డేట్ అయి ఉంటే మీ మొబైల్ నంబ‌ర్‌కు త‌ర‌చుగా పీఎఫ్ వివ‌రాల‌కు సంబం‌ధించిన‌ మెసేజ్‌లు వ‌స్తూ ఉంటాయి. ఒక‌వేళ మెసేజ్‌లు రాకపోతే మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నుంబ‌ర్ నుంచి EPFOHO UAN అని టైప్ చేసి… 77382 99899 నంబ‌ర్‌కు మెసేజ్ చేయాలి. వెంట‌నే పీఎఫ్ బ్యాలెన్స్‌, వ‌డ్డీ వివ‌రాల‌తో రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్‌కు మెసేజ్ వ‌స్తుంది.. 

ఇవి కూడా చ‌ద‌వండి..

పీఎఫ్ వ‌డ్డీరేటు 8.5 శాత‌మే

ఆధార్ నంబ‌ర్ మ‌ర్చిపోయారా? ఇలా తెలుసుకోండి

పుట్టిన‌ పిల్ల‌ల‌కు ఆధార్ కార్డు పొంద‌డ‌మెలా

బ‌ట్ట‌లు తెల్ల‌గా మెర‌వాలా? ఇలా ట్రై చేయండి

కంట్లో నీళ్లు రాకుండా ఉల్లిపాయ‌లు కోయ‌డ‌మెలా

Advertisement
పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవ‌డం ఎలా

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement