ఖిలా వరంగల్, మార్చి 7 : వరంగల్ కలెక్టరేట్లో మంగళవారం టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో హోలీ సంబురాలు జరుపుకున్నారు. ఆటాపాటలతో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. కలెక్టర్ బీ గోపీ ఉద్యోగులు, జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గజ్జెల రాంకిషన్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ప్రధాన కార్యదర్శి గాజె వేణుగోపాల్, కోశాధికారి పాలకుర్తి సదానందం, సహ అధ్యక్షుడు మేమానాయక్, ఉపాధ్యక్షుడు గద్దల రాజు, మురళీధర్‌రెడ్డి, సహాయ కార్యదర్శులు ఇంద్రసేనారెడ్డి, సుధాకర్, కుమారస్వామి, రామకృష్ణ, సిటీ కార్యదర్శి మధుచందర్, జిల్లా నాయకులు రమేశ్, నాగేశ్వర్రావు, గణేశ్, సత్యానారాయణ, మణికుమార్, ఏఓ శ్రీకాంత్, టీజీవో అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు.
వరంగల్ మహానగరంలో..
వరంగల్ మహానగరంలో హోలీ సంబురాలు ఘనంగా జరిగాయి. ప్రజలంతా వయోభేదం లేకుండా హోలీ సంబురాల్లో మునిగిపోయారు. ఒకరిపై ఒకరు రంగులు పూసుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. శివనగర్, ఖిలా వరంగల్, ఆదర్శనగర్, వసంతపురం, గాడిపల్లి, దూపకుంట, బొల్లికుంట, గిరిప్రసాద్‌నగర్‌లో యువత పెద్ద సంఖ్యలో గుమిగూడి రంగులు చల్లుకున్నారు.
పోపా ఆధ్వర్యంలో..
పోపా ఆధ్వర్యంలో శివనగర్ హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోపా రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్, గుండు కామేశ్వర్, గోషికొండ సుధాకర్, మాటేటి అశోక్‌కుమార్, వట్నాల సత్యనారాయణ, సతీష్, శ్రీధర్, సంజీవ్, సదానందం పాల్గొన్నారు.
కరీమాబాద్‌లో..
కరీమాబాద్ : అండర్ రైల్వేగేట్ ప్రాంతంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఒకరిపై ఒకరు రంగులు జల్లుకున్నారు. కాలనీలన్నీ రంగులతో కనిపించాయి. ఆయా పార్టీల కార్యకర్తలు తమ నాయకుల ఇండ్లకు వెళ్లి రంగులు పూశారు. ఉద్యోగులు తమ బాస్ దగ్గరకు వెళ్లి రంగులను పూసి పండుగను ఆనందంగా జరుపుకున్నారు.
గిర్మాజీపేటలో..
గిర్మాజీపేట : హోలీ వేడుకలు పలు చోట్ల ఘనంగా నిర్వహించుకున్నారు. చిన్నా, పెద్దా ఒకరికికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ రంగులు చల్లుకున్నారు. హంటర్‌రోడ్డులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరంగల్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా వరంగల్ బ్రాంచ్ చైర్మన్ రాయబరపు హరికృష్ణ ఆధ్వర్యంలో హోలీ సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి పూజారి సత్యనారాయణ, వైస్‌చైర్మన్ భగవాన్‌దాస్ ముందడ, కోశాధికారి మన్నెం రామకృష్ణ, స్టూడెంట్ అసోసియేషన్ చైర్మన్ మాదారపు సుజిత్, సభ్యులు ప్రదీప్ చందర్, మాణిక్యప్రసాద్, త్రిపురనేని గోపీచంద్, కొయ్యల రాజు, చంచల్ అగర్వాల్ పాల్గొన్నారు. అలాగే పిన్నవారివీధిలో బీఆర్ఎస్ నేత గందె నవీన్ ఆధ్వర్యంలో పండుగ జరుపుకున్నారు.
మార్వాడీ సమాజ్ ఆధ్వర్యంలో..
వరంగల్ చౌరస్తా : సిక్వాల్ మార్వాడీ సమాజ్ ఆధ్వర్యంలో వరంగల్ అండర్ బ్రిడ్జి వద్దనున్న నాగకన్య మందిరం ఎదుట కాముడి దహనం చేశారు. చిన్న పిల్లల ను గుర్రపు బగ్గీల్లో ఊరేగింపుగా నాగకన్య మందిరానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. వరంగల్ నగరంలోని మార్వాడీ సమాజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. 36వ డివిజన్ చింతల్, పుప్పాల గుట్ట, ఏసీ రెడ్డి నగర్, టీచర్స్ కాలనీల్లో హోలీ వేడుకలు జరుపుకున్నారు. 27వ డివిజన్ పరిధిలోని గిర్మాజీపేట, లక్ష్మిపురం, దయానందకాలనీ, యాకుబ్పుర ప్రాంతాల్లో వేడుకలు జరుపుకున్నారు.
పోచమ్మమైదాన్‌లో..
పోచమ్మమైదాన్ : హోలీ పండుగను పోచమ్మమైదాన్ సెంటర్లో ఘనంగా జరుపుకున్నారు. స్థానికులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. కొత్తవాడ, దేశాయిపేట రోడ్డు, కల్యాణ్‌నగర్, శ్రీనివాస వాసవీ కాలనీ, ఆటోనగర్ ప్రాంతాల్లో చిన్న, పెద్దా తేడా లేకుండా హోలీ పండుగలో పాల్గొన్నారు. పోచమ్మమైదాన్‌లోని ఎంజీఎం డాక్టర్ బందెల మోహన్‌రావు ఇంటికి మిత్రులు, స్థానికులు వెళ్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.