హెడ్డింగ్లీ: ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడవ టెస్టులో ఓ అద్భుతం జరిగింది. కివీస్ బ్యాటర్ నికోల్స్ అనూహ్య రీతిలో ఔటయ్యారు. తొలి రోజు టీ విరామ సమయం తర్వాత ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ బౌలింగ్‌లో నికోల్స్ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. ముందుకు వచ్చి బలవంతంగా షాట్ కొట్టాడు. అయితే ఆ బంతి నాన్ స్ట్రయికర్ డారెల్ మిచెల్ బ్యాట్ తగిలి గాలిలోకి ఎగిరింది. బ్యాట్‌కు తగిలిన తర్వాత అంపైర్ మీదుగా వెళ్తూ ఆ బంతి కాస్త మిడ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అలెక్స్ లీస్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో నికోల్స్ ఊహించని రీతిలో నిష్క్రమించాడు. ఆ ఔట్‌కు సంబంధించిన వీడియో ఇదే.
What on earth!? 😅🙈
Scorecard/clips: https://t.co/AIVHwaRwQv
🏴 #ENGvNZ 🇳🇿 pic.twitter.com/yb41LrnDr9
— England Cricket (@englandcricket) June 23, 2022