Health tips | మీ ఒంట్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే రెగ్యులర్‌గా ఇవి తీసుకోవాలట..!
Health tips | ఈ రోజుల్లో వ్యాధులు వేగంగా విజృంభిస్తున్నాయి. దాంతో అందరూ వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాల గురించి ఆలోచిస్తున్నారు. కరోనా వచ్చి పోయినప్పటి నుంచి ఎక్కడ చూసినా వ్యాధినిరోధక శక్తి గురించే చర్చ జరుగుతున్నది.
Health tips : ఈ రోజుల్లో వ్యాధులు వేగంగా విజృంభిస్తున్నాయి. దాంతో అందరూ వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాల గురించి ఆలోచిస్తున్నారు. కరోనా వచ్చి పోయినప్పటి నుంచి ఎక్కడ చూసినా వ్యాధినిరోధక శక్తి గురించే చర్చ జరుగుతున్నది. శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకుంటే వ్యాధుల ప్రభావం పెద్దగా ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచే ఆ ఆహార పదార్థాలేవో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇమ్యూనిటీ ఫుడ్స్..
శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపు కోసం ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. పెరుగులో ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. అంతేగాక పెరుగు అనేక వ్యాధి కారకాలను నిర్మూలిస్తుంది. ఒంట్లో మంటను కూడా తగ్గిస్తుంది. ప్రతిరోజు ఒక కప్పు పెరుగు తీసుకోవడంవల్ల వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది.
వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.
విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడంవల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ డి సాధారణంగా సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. అదేవిధంగా సాల్మన్ చేపలు, బలవర్ధకమైన పాలలో కూడా విటమిన్ డి ఉంటుంది.
పుట్టగొడుగులు కూడా వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. విటమిన్ బి, ప్రొటీన్, ఫైబర్, విటమిన్ సి, క్యాల్షియం, ఇతర ఖనిజాలు ఉండటంవల్ల వీటితో రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. యాంటీ ఇన్ఫెక్షన్ కార్యకలాపాల కోసం పుట్టగొడుగులు తెల్ల రక్త కణాలను ఉత్తేజపరుస్తాయి. కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగాలంటే ప్రతిరోజు ఒక కప్పు పుట్టగొడుగులు తినడం మంచిది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మీ ఒంట్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే రెగ్యులర్‌గా ఇవి తీసుకోవాలట..!
TTD Insurance | తిరుమల భక్తులకు బీమా పథకం ప్రారంభం.. ఏడుగురికి పరిహారం అందజేత
RS Praveenkumar | మెటా కేసులో ఒక న్యాయం.. ‘మహా’ కేసులో మరో న్యాయం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
టీఏజీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీ
RS Praveen Kumar | హైదరాబాద్‌లో టెర్రర్ అటాక్స్ ఉన్నాయనే కాన్ఫిడెన్షియల్ మెసేజ్ సోషల్ మీడియాలోకి ఎలా వెళ్లింది?
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

