పసుపు పాలు తాగితే ఎన్ని లాభాలో..!
Health tips | దగ్గు, జలుబుతో బాధపడేవారు పసుపు పాలను తాగితే ఇట్టే ఉపశమనం లభిస్తుంది. మన పూర్వీకులు కూడా పసుపు పాలు తాగేవారు.

రోజూ పాలు తాగే అలవాటు అందరికీ ఉంటుంది. అయితే, దానికి కాస్త మంచి పసుపు జోడిస్తే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం అని అంటున్నారు నిపుణులు. పాలలో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మెదడును ఎంతో చురుగ్గా ఉంచుతాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మెదడులోని కణాల ఆర్యోగానికి సహాయపడతాయి. రోజూ మూడు గ్లాసుల పాలు తాగేవారు వ్యాధులకు దూరంగా ఉంటారని పలు పరిశోధనల్లోనూ తేలింది. అలాంటి సుగుణాలున్న పాలకు పసుపు తోడైతే ఆరోగ్యానికి అదనపు ప్రయోజనాలు లభించినట్లే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఇది పురాతన కాలం నుంచి ఉన్నదే. మన పూర్వీకులు కూడా పసుపు పాలను తాగేవారు. అందుకే వారు ఆరోగ్యంగా ఉండేవారు. దగ్గు, జలుబుతో బాధపడేవారు ఈ పసుపు పాలను తాగితే ఇట్టే ఉపశమనం లభిస్తుంది. కఫం ఎక్కువగా ఉండి ఇబ్బందిపడేవారు వెచ్చని పసుపు పాలు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
పాలలో సెరటోనిన్ అనే బ్రెయిన్ కెమికల్, మెలటోనిన్ ఉంటాయి. ఇవి పసుపులో ఉండే వైటల్ న్యూట్రియంట్స్‌తో కలిసి ఒత్తిడిని తొలగిస్తాయి. దానివల్ల హాయిగా నిద్ర పడుతుంది.
పసుపు పాలతో మరిన్ని ప్రయోజనాలు
- రోగ నిరోధకశక్తిని పెంచుతాయి.
- పసుపు పాలు వైరల్ దాడి నుంచి కాలేయాన్ని రక్షిస్తాయి. కాబట్టి కాలేయ సంబంధ పచ్చ కామెర్ల లాంటి వ్యాధులు రావు.
- కాలేయంలో చేరే విషకారకాలను హరిస్తుంది.
- ముక్కు దిబ్బడ, తలనొప్పి, ఇతర నొప్పులను తగ్గిస్తుంది.
- కీళ్ల వాపులు, నొప్పులు తగ్గాలంటే పసుపు పాలను క్రమం తప్పక తాగాలి.
- పసుపు పాలలో ఉండే పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి లింఫోటిక్ సిస్టమ్‌ను కూడా శుద్ధిచేస్తాయి.
- కామెర్లు దరిచేరకుండా అరికడుతుంది.
- పసుపులో ఉండే కర్క్యుమిన్ శరీరంలో వైరస్ వృద్ధిని అరికడుతుంది.
- నీటి ద్వారా శరీరంలోకి చేరుకున్న వైరస్ త్వరితగతిన రెట్టింపు అవకుండా పసుపు నియంత్రిస్తుంది.
- పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ వల్ల కీళ్లు బలపడతాయి.
- రుతుక్రమం వల్ల కలిగే పొత్తి కడుపు, ఇతర ఒంటి నొప్పులను దూరం చేస్తుంది.
ఇవి కూడా చదవండి..
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతా పాజిటివ్..ఎందుకిలా!
వర్క్ బిజీలో శృంగారానికి దూరమవుతున్నారా.. ప్రమాదమేనట!
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Health news
- Helath
- Pintop
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

