వర్క్ బిజీలో శృంగారానికి దూరమవుతున్నారా.. ప్రమాదమేనట!
శృంగార కోరికలు ఉన్నప్పటికీ చాలా మంది సమయం లేకో.. భాగస్వామితో చనువు లేకో శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారట.

పొద్దునే లేవడం, పనంతా చేసుకుని గబ గబా ఏదో ఒకటి తిని ఆఫీసుకు బయల్దేరడం, ఆఫీసు పనయ్యాక తిరిగి ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకోవడం, తినడం పడుకోవడం.. ఇలా రోజంతా బిజీ బిజీగా గడిపేస్తున్నారా.. అలా అయితే మీ వ్యక్తిగత జీవితానికి మీకు మీరు అన్యాయం చేసుకుంటున్నట్లేనట. అంతే కాదు మీ భాగస్వామికి మీరు దూరం అవుతున్నట్లేనట. నిజమే నండి.. శృంగార జీవితాన్ని సరిగా గడపలేని లేని జంటలు విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. మరేం చెయ్యాలి పని చేయకపోతే బతకలేం కదా…రోజంతా కష్టపడి అన్ని పనులు చేశాక శృంగారానికి ఓపిక ఉండదు కదా అని ఫీల్ అవుతుంటారు చాలా మంది. కానీ పని ముఖ్యమా, శృంగారం ముఖ్యమా అంటే రెండూ ముఖ్యమే అంటున్నారు చాలా మంది సైకాలజిస్టులు. శృంగారంలో ఎంజాయ్ చేసినప్పుడే జీవితంలో అన్ని పనులు బాగా చేయగలుగుతాం అంటున్నారు.
శృంగార కోరికలు ఉన్నప్పటికీ చాలా మంది సమయం లేకో.. భాగస్వామితో చనువు లేకో శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారట. పని ఒత్తిడి కారణంగా ఓపిక లేక శృంగారంలో పాల్గొనలేకపోతున్నామని మరికొందరు అంటున్నారు. ఇలాంటి వారిలో శృంగారంపై ఆసక్తి పెంచడానికి .. పని ఒత్తిడిని దూరం చేసుకుని శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.. అవేంటో ఓసారి పరిశీలిద్దాం పదండి..
శృంగారం గురించి మాట్లాడుకోండి
చాలా మంది తమ భాగస్వామితో శృంగారానికి సంబంధించిన విషయాలు మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటారు. దీని గురించి మాట్లాడుకోవడమేంటి అని సిగ్గు పడుతుంటారు. కానీ శృంగారం గురించి, బెడ్ రూంలో మీ పర్సనల్ విషయాల గురించి మీరు మాట్లాడుకోవడం వల్ల మీ అభిప్రాయాలు బయటపడతాయట. తద్వారా మీ శృంగార జీవితం మరింత సుఖంగా మారుతుందట. అంతేకాదు.. మీ వైవాహిక జీవితం కూడా సంతోషంగా సాగుతుందట.
అప్పుడప్పుడూ ప్రేమగా తాకండి
చాలా మంది భార్యభర్తలు కేవలం బెడ్ రూంలోనే తప్ప మిగతా సమయాల్లో ఒకరినొకరు తాకరు. అందరూ ఉన్నారనో, ఎవరో చూస్తారనో ఇలా కారణాలేవైనా కావొచ్చు. కానీ అప్పుడప్పుడు మీరు తాకుతుండటం వల్ల పరస్పరం ప్రేమ పెరుగుతుందట. చిన్న చిన్న తాకిడిలు మీలో శృంగార ఆసక్తిని రెట్టింపు చేస్తాయట. ఉదాహరణకు చేతులు తాకించడం, ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం లాంటివి చేయడం వల్ల ఇద్దరి మధ్య చనువు పెరిగి, బంధం బలపడుతుందట.
కొత్తగా ట్రై చేయండి
రోజూ ఒకేలా శృంగారం చేయడం వల్ల కూడా జీవితం బోర్ కొడుతుందట. ముఖ్యంగా ఆడవారికి ఒకే భంగిమలో శృంగారం చేయడం పెద్దగా నచ్చకపోవచ్చట. కాబట్టి అప్పుడప్పుడు స్టైల్ మార్చడం వల్ల ఇద్దరిలోనూ ఆసక్తి పెరుగుతుందంటున్నారు నిపుణులు.
సానుకూలతను పెంచుకోండి
మీ పడకగదిలో మీకు నచ్చని విషయాల గురించి .. మీరు బాగా ఎంజాయ్ చేసిన నిమిషం గురించి మాట్లాడుకోవడం వల్ల మీ శృంగార జీవితంలో సానుకూలత పెరుగుతుందట. ఇలాంటి సందర్భాలను గుర్తుచేసుకుని ఒకరిని ఒకరు పొగుడుకోవడం వల్ల శృంగార జీవితం మరింత సుఖమయం అవుతుందట.
సరదాగా మాట్లాడటం
మీ భాగస్వామితో శారీరకంగా కలవడం కోసం ముందు నుంచే మానసికంగా సిద్ధం చేయడం మంచిదట. ఉదాహరణకు ఫోన్లో తనతో శృంగారం గురించి సరదాగా వారితో మాట్లాడటం, ఫ్లర్ట్ చేయడం లాంటివి. ఇలాంటివి చేయడం వల్ల మీరు, మీ పార్ట్నర్ శృంగారం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారట.
వ్యాయామం చేయండి
వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిందే. కానీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుందట. వ్యాయామం మీ శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరిచి.. శృంగార కోరికలను కూడా పెంచుతుందట.
కలిసి పనిచేయండి
ఇంట్లో భార్య ఇది చేయాలి, భర్త ఇది చేయాలి అని షరతులు పెట్టుకోకుండా.. ఇద్దకు కలిసి పని చేసుకోవడం వల్ల కూడా శృంగార జీవితం బాగుంటుందంట. ఒకరి పనులు ఒకరు చేయడం వల్ల పరస్పరం ప్రేమ, గౌరవం పెరిగి పడక గదిలో సంతోషంగా గడుపుతారట.
రాత్రుళ్లే కాదు..
ఒకవేళ మీ భాగస్వామి శృంగార విషయంలో ఆసక్తి చూపకపోతే.. రాత్రుళ్లు కాకుండా వేరే సమయాల్లో శృంగారంలో పాల్గొనండి. ఎప్పుడూ ఒకే సమయంలో శృంగారం చేయడం కూడా రొటీన్ అనిపించి కొందరికి ఆసక్తి అనిపించకపోచ్చని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఖాళీ సమయం ఉంటే.. ఉదయమో, మధ్యాహ్నమో ట్రై చేసి చూడండి.
కలిసి తినడం, టీవీ చూడటం, కలిసి స్నానం చేయడం లాంటి చిన్న చిన్న విషయాలు కూడా దాంపత్య జీవితాన్ని బలంగా తయారు చేసి.. శృంగార జీవితాన్ని మరింత ఎంజాయ్ చేసేలా చేస్తాయని సెక్స్నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
నిద్రించేముందు గోరు వెచ్చని నీటిని తాగితే కలిగే ప్రయోజనాలు తెలుసా..?
నిద్రపట్టట్లేదా.. ఈ పండ్లు తినండి!
కొంబుచా టీ తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా..?
రోజూ పుచ్చకాయ తినడం మంచిదేనా
షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

