హర్యానా అసెంబ్లీ : విశ్వాసం తీర్మానం నెగ్గిన ఖట్టర్ సర్కార్

చండీగఢ్: మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వంపై అసెంబ్లీలో విపక్షాలు చేపట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనను పాలక ప్రభుత్వం అణిచివేస్తోందని ఆరోపిస్తూ విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. రైతు నిరసనల్లో వందలాది అన్నదాతలు నేలకొరుగుతున్నా ఖట్టర్ సర్కార్ చోద్యం చూస్తోందని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ మాజీ సీఎం, విపక్ష నేత భూపీందర్ సింగ్ హుడా అరోపించారు. రాష్ట్ర సరిహద్దుల్లో 250 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని వారి పేర్లను తాను అందించినా అవి వార్తా పత్రికల్లో కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక తన ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడాన్ని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తప్పుపట్టారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకూ ఒకసారి తన సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని ఆరోపించారు. భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్‌పైనా కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ దుష్ప్రచారం సాగిస్తోందని హర్యానా ఉపముఖ్యమంత్రి దుష్యంత్ సింగ్ చౌతాలా ఆరోపించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

