Deeksha Divas | కేసీఆర్ దీక్షాబలం.. అమరుల త్యాగఫలం.. నేటి తెలంగాణ: హరీశ్‌రావు
Deeksha Divas | కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష చరిత్ర గతిని మార్చిందని, తెలంగాణ తరతరాల ఆకాంక్షను నెరవేర్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని అన్నారు.
Deeksha Divas | కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష చరిత్ర గతిని మార్చిందని, తెలంగాణ తరతరాల ఆకాంక్షను నెరవేర్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని పేర్కొంటూ నవంబర్ 29, 2009న ఆయన చేపట్టిన దీక్షను గుర్తుచేసుకున్నారు. దీక్షా దివస్ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక సందేశం పంచుకున్నారు కేసీఆర్ దీక్షాబలం.. అమరుల త్యాగఫలం.. నేటి తెలంగాణ రాష్ట్రమని తెలిపారు.
కేసీఆర్ ఆత్మబలాన్ని ఆయుధంగా, వాక్శక్తిని ఇంధనంగా, నిజాయితీ, నిబద్ధతలను కవచకుండాలుగా చేసుకొని తెలంగాణ పోరాటాన్ని విజయతీరాలకు చేర్చిన యోధుడని హరీశ్‌రావు కొనియాడారు. పదవులను వదిలి ప్రజలను ఏకం చేశారని, ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఢిల్లీ పాలకులను వణికించారని పేర్కొన్నారు. అర్ధ శతాబ్దపు తెలంగాణ ఆకాంక్షను సాకారం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని తెలిపారు.
భూమిపుత్రుల పోరాట చరిత్రలో కేసీఆర్ పేరు చెరగని మూడు అక్షరాలని హరీశ్‌రావు పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో సుపరిపాలనతో ప్రగతి సంతకం చేసిన నాయకుడిగా, భవిష్యత్ తరాలకు ఉద్యమ స్ఫూర్తిని అందించే పాఠంగా కేసీఆర్ నిలుస్తారని అన్నారు. ‘కేసీఆర్ అంటే తెలంగాణ గర్వం.. కేసీఆర్‌కు తెలంగాణే సర్వం’ అంటూ తన సందేశాన్ని ముగించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షను దీక్షా దివస్‌గా గుర్తుచేసుకుంటూ ‘జై తెలంగాణ’ అంటూ నినదించారు.
కేసీఆర్ గారి దీక్షాబలం..
అమరుల త్యాగఫలం..
నేటి తెలంగాణ రాష్ట్రం.చరిత్ర గతిని మార్చింది కేసీఆర్ గారి నిరాహార దీక్ష, అది నెరవేర్చింది తరతరాల తెలంగాణ ఆకాంక్ష, నిన్నైనా నేడైనా రేపైనా..
కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్షఆత్మబలమే ఆయుధంగా..
వాక్ శక్తే ఇంధనంగా..
నిజాయితీ నిబద్దతలే కవచ కుండలాలుగా..
తెలంగాణ పోరాటాన్ని విజయతీరం చేర్చిన యోధుడు కేసీఆర్ గారు.పదవులు వదిలి ప్రజలను ఒక్కటి చేసిండు.
ప్రాణాన్నే పణంగా పెట్టి ఢిల్లీ గద్దెను వణికించిండు.
అర్ధ శతాబ్దపు ఆకాంక్షను సాకారం చేసి తెలంగాణను ఆవిష్కరించిండు.భూమి పుత్రుల పోరాట చరిత్రలో చెరగని మూడు అక్షరాలు కేసీఆర్
స్వరాష్ట్రంలో సుపరిపాలన చేసిన ప్రగతి సంతకం కేసీఆర్
భవిష్యత్ తరాలలో సైతం స్పూర్తిని వెలిగించే ఉద్యమ పాఠం కేసీఆర్కేసీఆర్ అంటే తెలంగాణ గర్వం..
కేసీఆర్ కు తెలంగాణే సర్వం..నవంబర్ 29, 2009 – దీక్షా దివస్
జై తెలంగాణ✊#DeekshaDiwas
— Harish Rao Thanneeru (@BRSHarish) November 29, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | కేసీఆర్ దీక్షాబలం.. అమరుల త్యాగఫలం.. నేటి తెలంగాణ: హరీశ్‌రావు
KCR | తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’.. ఆ దీక్ష దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది: కేటీఆర్
Scene | ఓటీటీలోకి సూర్య ‘సీన్’.. తెలుగు, హిందీలో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుంది అంటే..!
Earthquake | ల్యాండింగ్‌కు క్షణాల ముందు భూకంపం.. గాల్లోకి తిరిగి వెళ్లిన విమానం!
Irumudi | ఓటీటీ కాలంలోనూ 100 రోజులు ఆడిన రవితేజ సినిమా.. ఆరు సెంటర్లలో అరుదైన రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

