హంసానందినికి క్యాన్సర్.. చిరునవ్వుతో జయిస్తా..!
హంసలాంటి అందమైన దేహాన్ని కీమో థెరపీలు కాల్చివేస్తున్నాయి. నిగనిగలాడే కురులు..ఒక్కొక్కటిగా రాలిపోతున్నాయి. చందమామకే వన్నెలద్దిన ముఖారవిందం.. కళావిహీనంగా మారిపోతున్నది. అయినా, తన పెదవులు చిరునవ్వు చిందిస్తూనే ఉన్నాయి. ‘మీ ప్రేమాభి మానాలు నాతో ఉంటే.. నా చిరునవ్వునే ఆయుధంగా చేసుకొని క్యాన్సర్‌ను జయిస్తా’ అంటున్నది హంసానందిని ఇన్‌స్టా వేదికగా..

‘జీవితం ఎలాంటి సవాళ్లు విసిరినా.. ఎంత నిర్దయగా ఉన్నా నేను బాధితురాలిగా మాత్రం మిగిలిపోను. భయం, నిరాశావాదం, ప్రతికూల భావనలు నా పయనాన్ని నిర్దేశించలేవు. ధైర్యంగా ముందడుగు వేస్తా. నిష్క్రమణకు ఎప్పుడూ ఒప్పుకోను. 4 నెలల క్రితం, నా రొమ్ములో చిన్న కణితి ఉన్నట్లు అనిపించింది. ఆ క్షణమే జీవితం ఎప్పటికీ ఒకేలా ఉండబోదని నాకు అనిపించింది. కారణం 18 ఏండ్ల క్రితం ఇదే వ్యాధితో మా అమ్మను కోల్పోయాను. అనుమానం కొద్దీ వైద్యులను సంప్రదించాను. మమోగ్రఫీ ద్వారా కణితిని పరిశీలించారు. బయాప్సీ అవసరమని, సర్జికల్ ఆంకాలజిస్ట్‌ను కలువమని సూచించారు. నా అనుమానం నిజమైంది. నాకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారించారు వైద్యులు.
ఆ కణితి ఎక్కువగా వ్యాప్తి చెందలేదని, త్వరగా గుర్తించడం చాలా మేలైందని, వెంటనే తొలగించాలన్నారు. భయపడితే జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అందుకే, ఆపరేషన్ థియేటర్‌కి ధైర్యంగా నడిచాను. నాకు వచ్చింది వంశపారంపర్య రొమ్ము క్యాన్సర్. అది కూడా మూడో దశలో ఉంది. మరొక రొమ్ముకు వ్యాపించే ఆస్కారం ఉంది. గర్భాశయ క్యాన్సర్ బారినపడే ప్రమాదమూ లేకపోలేదని చెప్పారు. అందుకే, ఇప్పటికి తొమ్మిది కీమో థెరపీలు చేయించుకున్నా. మరో ఏడు చేయించుకోవాలి.
ఈ వ్యాధిని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వను. దానిని నేను చిరునవ్వుతోనే జయిస్తాను. మునుపటికంటే మరింత మెరుగ్గా, దృఢంగా మళ్లీ తెరపై కనిపించి మిమ్మల్ని అలరిస్తాని మాటిస్తున్నా. నేను నా కథను చెప్పడం వల్ల ఇతరులు స్ఫూర్తిపొందుతారని చిన్న ఆశ. నాకు క్యాన్సర్ అనే విషయం తెలిసి చాలామంది మెసేజ్‌లు, ఫోన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సమాధానం ఇవ్వలేకపోతున్నందుకు మన్నించండి. మీ ప్రేమ, ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు. ప్రస్తుతం నిపుణులైన వైద్యుల బృందం సంరక్షణలోనే ఉన్నాను. త్వరలోనే మీ ముందుకొస్తా .. ప్రేమతో మీ హంస’.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

