Arvind Kejriwal | నా తిండిపై ఈడీ రాజకీయం.. బెయిల్ కోసం పక్షవాతాన్ని కోరుకుంటానా?: కేజ్రీవాల్
ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ శుక్రవారం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈడీపై తీవ్ర విమర్శలు చేశారు. తాను జైలులో తింటున్న ఆహారంపై ఈడీ చిల్లర మల్లరగా వ్యవహరిస్తున్నదని, రాజకీయం చేస్తున్నదని ఆరోపించారు
- వాళ్లు చెప్పేవన్నీ అబద్ధాలు..
- ఢిల్లీ సీఎం డైట్ చార్ట్‌పై వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్
Arvind Kejriwal | న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ శుక్రవారం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈడీపై తీవ్ర విమర్శలు చేశారు. తాను జైలులో తింటున్న ఆహారంపై ఈడీ చిల్లర మల్లరగా వ్యవహరిస్తున్నదని, రాజకీయం చేస్తున్నదని ఆరోపించారు. తన వైద్యుడు రూపొందించిన డైట్ చార్ట్‌కు అనుగుణంగానే తాను ఆహారాన్ని స్వీకరిస్తున్నానని చెప్పారు. మరోవైపు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందిస్తూ, కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ ఇవ్వడం లేదనే ఆరోపణలపై వైద్య నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
అనారోగ్య కారణాలను సాకుగా చూపి బెయిల్ పొందేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారన్న ఈడీ ఆరోపణలపై కేజ్రీవాల్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టులో వాదనలు వినిపించారు. ‘బెయిల్ పొందడానికి నేను పక్షవాతం రిస్క్ తీసుకుంటానా? నేను ఏం తిన్నా, అది నా అరెస్ట్‌కు ముందు నా వైద్యుడు రూపొందించిన డైట్ చార్ట్‌కు అనుగుణంగానే తింటున్నాను’ అని కేజ్రీవాల్ చెప్పినట్లు కోర్టుకు తెలిపారు. ‘ఇంటి నుంచి పంపించిన 48 భోజనాల్లో కేవలం మూడుసార్లు మాత్రమే మామిడి పండ్లు పెట్టారు. ఈడీ ఆరోపణలు పూర్తిగా తప్పు’ అని కేజ్రీవాల్ తెలిపినట్లు సింఘ్వి కోర్టుకు చెప్పారు. ప్రతి రోజూ 15 నిమిషాలపాటు ఫిజిషియన్‌ను సంప్రదించేందుకు అనుమతించాలని కేజ్రీవాల్ కోర్టును కోరారు. ఖైదీని అయినంత మాత్రానికి గౌరవప్రదంగా, ఆరోగ్యంగా జీవించే హక్కు నాకు లేదా? అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ ఆరోపణలను ఈడీ తోసిపుచ్చింది. కేజ్రీవాల్ తింటున్న ఆహారం డైట్ చార్ట్‌కు అనుగుణంగా లేదని తెలిపింది. ఆయనకు గల మధుమేహానికి చికిత్స చేయడానికి తగిన వైద్య సదుపాయాలు తీహార్ జైలులో ఉన్నాయని చెప్పింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వు చేసింది. దీనిపై అవసరమైతే, సమాధానాన్ని దాఖలు చేయాలని తీహార్ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. సోమవారం తీర్పు వెలువడే అవకాశం ఉంది.
ఏ ప్రమాదమైనా జరగొచ్చు
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేజ్రీవాల్ ఆరోగ్యంపై జైలులో భారీ కుట్ర జరుగుతున్నదని, ఏ క్షణంలోనైనా, ఏ ప్రమాదమైనా జరగొచ్చునని అన్నారు. హత్య చేసే స్థాయికి బీజేపీ దిగజారగలదని, కేజ్రీవాల్ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే కుట్రలో భాగస్వాములయ్యే అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆప్ ఆరోపణలు తప్పు: బీజేపీ
కేజ్రీవాల్‌ను జైలులో హత్య చేసేందుకు కుట్ర జరుగుతున్నదని ఆప్ చేసిన ఆరోపణలను బీజేపీ ఖండించింది. బీజేపీ అధికార ప్రతినిధి షాజియా ఇల్మి శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తామంతా కేజ్రీవాల్ ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నామని చెప్పారు. కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడానికి బాధ్యులం కావాలని ప్రభుత్వ వ్యవస్థ కానీ, జైలు యంత్రాంగం కానీ ఎందుకు కోరుకుంటాయని ప్రశ్నించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Raids | మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇంజినీర్లు
Stock Markets | భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. కారణాలు ఇవే..!
Damarukam | 14 ఏళ్ల నాగార్జున రికార్డుకు ఎసరు.. ‘ఢమరుకం’కి చేరువలో తరుణ్ భాస్కర్, దుల్కర్ సినిమాలు!
Cholesterol | కొలెస్ట్రాల్ సాధారణంగానే ఉన్నా గుండెకు ప్రమాదం తప్పదా? ఈ పరీక్షలు కీలకం!
BRS Complaint | బీఆర్ఎస్ నాయకుడిపై దాడి..కేసులు నమోదు చేయాలని ఎస్పీకి ఫిర్యాదు
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

