Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Tanzania | తెలంగాణ ఆడపడుచులు జరుపుకునే పూల పండుగ బతుకమ్మ వేడుకలు టాంజానియా లోని దార్ ఎస్ సలాం నగరంలో ఘనంగా నిర్వహించారు.
టాంజానియా: తెలంగాణ ఆడపడుచులు జరుపుకునే పూల పండుగ బతుకమ్మ వేడుకలు (Bathukamma Celebrations ) టాంజానియా ( Tanzania ) లోని దార్ ఎస్ సలాం నగరంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ప్రముఖ్ సదన్ భవన్లో తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు భారత హైకమిషనర్ బిశ్వదీప్ దే ( Bishwadip Dey ) హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.
ఈ వేడుకల్లో దాదాపు 600 మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. తెలంగాణ ఆడ పడుచులు తొమ్మిది రకాల పూలతో అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పేర్చి, సాంప్ర దాయ వస్త్రధారణలో బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటం ఆడుతూ తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సంబరాలు జరుపుకున్నారు. మహిళలు, చిన్నారులు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను విజయవంతం చేసినందుకు అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ కమిటీ చైర్మన్ సైదులు, వైస్ చైర్మన్ సంపత్ , ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు వంగ నర్సింహారెడ్డి, సురేందర్ సీలం, సంతోష్ రెడ్డి పటోళ్ల, సంతోష్ రెడ్డి, మధు రెడ్డి, సూర్య మోహన్ రెడ్డి, ప్రవీణ్, మహేష్ రెడ్డి , కమిటీ సభ్యులు రమేష్, శరత్, రేవంత్, సాయి కృష్ణ, శ్రవణ్, శ్రీనివాస్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

