పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి

ఆదిలాబాద్ : పాడి పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని, సర్కారు చేయూతను రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలో రూ.5.6 కోట్లతో ఆధునీకరించిన విజయ పాలశీతలీకరణ కేంద్రం, పాల ఉత్పత్తుల కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాడి పరిశ్రమ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలతో విజయ డెయిరీ బలోపేతమైందన్నారు. డెయిరీ అభివృద్ధికి నిధులు కేటాయించడమే కాకుండా అనేక పథకాలను అమలు చేసి రైతులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు.
టీఎస్‌డీడీసీఎఫ్ చైర్మన్‌గా లోక భూమా రెడ్డి ఈ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో నిబద్ధతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. అదిలాబాద్ జిల్లాకు తలమానికంగా విజయ డెయిరీ యూనిట్ ను నిలిపేందుకు అందరూ కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ లోకా భూమారెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న, జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, మాజీ ఎంపీ నగేశ్, మత్స్య్ పరిశ్రమ, పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రాజేంద్ర, ఎండీ శ్రీనివాస రావు, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape | తుపాకీతో బెదిరించి.. చెల్లెలి కళ్ల ముందే అక్కపై గ్యాంగ్ రేప్.. దీపావళి రాత్రి దారుణం
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ రికార్డుల వేట.. ఆరో రోజు కూడా తగ్గని జోరు, ఒక్కరోజే 1.25 మిలియన్ టికెట్లు!
Samantha | తొలి వ్యాపారంలోనే భారీ నష్టాలు.. అయినా వెనక్కి తగ్గని సమంత, ఇప్పుడు 10 స్టార్టప్స్‌లో పెట్టుబడులు!
DSPs Transfers | డీఎస్పీల బదిలీలకు రంగం సిద్ధం.. జిల్లాలు, కమిషనరేట్లలో ఖాళీలపై ఉన్నతాధికారుల ఆరా
కాంగ్రెస్ పాలనలో కరోనా కంటే దారుణం.. రెండేళ్లలో భారీగా పడిపోయిన పెట్టుబడులు.. టీజీఐపాస్ గణాంకాల్లో నిగ్గుతేలిన నిజాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

