రూ.44వేల దిగువకు బంగారం ధర.. ఒక్కరోజులో రూ.1,822 తగ్గిన వెండి

న్యూఢిల్లీ: దేశంలో పసిడి ధరలు మరింత తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.522 తగ్గి రూ.43,887కు చేరింది. క్రితం ట్రేడ్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.44,409 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాలపై పెట్టుబడులకు మదుపర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఇవాళ బంగారం ధరలు దిగి వచ్చాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
బంగారంతోపాటే వెండి ధరలు కూడా ఇవాళ భారీగానే దిగొచ్చాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,822 తగ్గి రూ.64,805కు చేరింది. క్రితం ట్రేడ్‌లో కిలో వెండి ధర రూ.66,627 వద్ద ముగిసింది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లలో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,696 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 25.20 అమెరికన్ డాలర్లు పలికింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

