పేదలకు ఉచితంగా ఖరీదైన వైద్యం

- ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులతో పనిలేదు
- సమాజసేవలో తరిస్తున్న గోపాల్‌రావు
ఈ రోజుల్లో దవాఖానకు వెళ్లాలంటేనే బెంబేలెత్తాల్సిన పరిస్థితి. ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నా.. ఒక్క రోగమొస్తే అన్నీ హారతి కర్పూరంలా ఆవిరైపోతున్నాయి. మరి పేదలు అనారోగ్యం పాలైతే వారి పరిస్థితి ఆలోచిస్తేనే భయమేస్తుంది. కానీ నగరంలో పేదలకు అభయహస్తం అందిస్తున్నాయి కొన్ని వైద్యాలయాలు. ఆరోగ్య దేవాలయాలుగా అనునిత్యం పేదలకు ఉచితంగానే ఖరీదైన వైద్య సేవలు అందిస్తున్నాయి.
కాచిగూడ, అక్టోబర్ 30 : సమాజం మనకు ఏం చేసింది అనేది కాదు.. మనం సమాజానికి ఏం మేలు చేశాం అనేదే ముఖ్యం. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని నిరుపేదలకు, అనాథలకు ఉచిత వైద్య సేవతో పాటు సామాజిక, ధార్మిక కార్యక్రమాలు చేపడుతున్నారు కాచిగూడ ప్రాంతానికి చెందిన ఎస్.గోపాల్‌రావు. నిస్వార్థ సేవకుడిగా అందరి మన్ననలు పొందుతూ నగరం, అంబర్‌పేట నియోజకవర్గం వ్యాప్తంగా అనాథలు, వృద్ధులు, వికలాంగులు, పేద ప్రజలకు ఉచితంగా 6 వేల 400 చదరపు గజాలతో కూడిన వివిధ రకాల వైద్య సేవలను హర్రాస్పెంటలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో అందిస్తున్నారు. పేరు ప్రతిష్టల కోసం కాకుండా కేవలం మానవతా దృక్పథంతో ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా వేల మందికి పైగా వైద్య సదుపాయాలు అందించారు. మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి, మెడ, భుజాలు, కీళ్ల నొప్పులకు, పక్షవాతానికి ఆధునిక పరికరాలతో ఉచిత చికిత్స అందజేస్తున్నారు. అదే విధంగా షుగర్, బీపీ, బీఎంఐ ప్యాట్ టెస్ట్‌లను ఉచితంగా చేస్తున్నారు. ప్రతి నెల నగరంలోని వివిధ ప్రాంతాల్లో పేద ప్రజలు నివసించే బస్తీల్లోకి వెళ్లి ఖరీదైన ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు.
కుల మతాల పట్టింపు లేదు.. ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డుల అవసరమే లేదు. మానవతా దృక్పథంతో అంబర్‌పేట శ్మశాన వాటిక ప్రబంధక కమిటీ చైర్మన్ ఎస్.గోపాల్‌రావు ఆధ్వర్యంలో జనరల్, కార్డియాలజీ, గైనకాలజీ, 2డీ, ఎకో, ఆర్థోపెడిక్, కంటి పరీక్షలను అనుభవజ్ఞులైన డాక్టర్ల చేత ఉచితంగా అందిస్తున్నారు. ప్రసన్నాంజనేయ దేవాలయంలో ప్రతిరోజు ఉ. 8 గంటల నుంచి మ. 1 గంట వరకు డాక్టర్లు అందుబాటులో ఉంటారు.అనారోగ్యానికి గురైన వారికి తక్షణం వైద్యం అందించేందుకు అంబర్‌పేట స్మశాన వాటిక ప్రబంధక కమిటీ ప్రతినిధులు హెల్ప్‌లైన్ నెంబర్ 7286070331 ను ఏర్పాటు చేశారు. ఎవరైనా హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే చాలు డాక్టర్లు స్వయంగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌తో బాధితుడి ఇద్దకు వద్ద వాలిపోతారు. వైద్యానికి సంబంధించిన సహాయం, సలహాలు, మందులను ఉచితంగా అందజేస్తారు.
ప్రాణం ఉన్నంత వరకు సేవ చేస్తా..
సమాజానికి సాయాపడాలనే సేవా కార్యక్రమాలను నగర వ్యాప్తంగా చేపడుతున్నాం. పేదలకు ఎంత సేవ చేసినా తక్కువనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా. నా ప్రాణం ఉన్నంత వరకు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉచితంగా ఖరీదైన వైద్య సేవలు అందిస్తా. ప్రతిరోజు 80 నుంచి 120 మంది పేదలు ఈ వైద్య సదుపాయాలను
సద్వినియోగం చేసుకుంటున్నారు.
మరిన్ని సేవలు..
- దేవాలయంలో భక్తుల కోసం ఆధ్యాత్మిక పుస్తకాలతో రీడింగ్ రూమ్ ఏర్పాటు
- నగరవ్యాప్తంగా ఉచిత వైద్యసేవలు పొందేందుకు పేదలకు హెల్త్‌కార్డుల పంపిణీ
- కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నాలుగుసార్లు ప్రజలకు ఉచిత వ్యాక్సినేషన్
- లాక్డౌన్ కాలంలో వేలాది మందికి నిత్యావర సరుకుల పంపిణీ
- మానసిక, శారీరక వికలాంగులకు ట్రై సైకిళ్లను అందజేత
- పేదల కోసం ప్రత్యేక వైద్య శిబిరాల నిర్వహణ
- నిరుపేద మహిళలకు ఉచితంగా కుట్టుశిక్షణ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

