Right To Ignore | అక్కడ ఉద్యోగులు ఫ్రీ బర్డ్స్.. పని గంటల తర్వాత బాస్‌లను పట్టించుకోవాల్సిన పని లేదు!
ఉద్యోగుల పని సంబంధిత మానసిక సమస్యలకు చెక్ పెట్టే లక్ష్యంతో ఆస్ట్రేలియాలో తీసుకొచ్చిన ఒక కొత్త చట్టం ఈ నెల 26 నుంచి అమల్లోకి రానున్నది.
- ఫోన్లు, సందేశాలను తిరస్కరించే హక్కు
- ఆస్ట్రేలియాలో 26 నుంచి అమల్లోకి కొత్త చట్టం
Right To Ignore | కాన్బెర్రా, ఆగస్టు 23: ఉద్యోగుల పని సంబంధిత మానసిక సమస్యలకు చెక్ పెట్టే లక్ష్యంతో ఆస్ట్రేలియాలో తీసుకొచ్చిన ఒక కొత్త చట్టం ఈ నెల 26 నుంచి అమల్లోకి రానున్నది. ది ఫెయిర్ వర్క్ అమెండ్మెంట్(రైట్ టూ డిస్కనెక్ట్) చట్టం కింద ఉద్యోగులు పని గంటలు పూర్తయ్యాక తమ యజమానులను, వారి నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బాస్‌లను విస్మరించే హక్కును ఈ చట్టం కల్పిస్తుంది. యాజమాన్యాల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్, సందేశాలను, చెప్పే పనులను తిరస్కరించే ఉద్యోగులకు ఈ చట్టం కొంత మేర రక్షణ కల్పిస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ చట్టంలో కొన్ని మినహాయింపులు కూడా పొందుపరిచారు. ఉద్యోగుల తిరస్కరణను అసమంజసమైనదనిగా చెప్పేందుకు సదరు ఉద్యోగి జాబ్ రోల్, బాధ్యతలు, కారణం వంటి వాటి ద్వారా కొన్ని ప్రత్యేక పరిస్థితులను చట్టంలో పేర్కొన్నారు.
యాజమాన్య సంఘాల వ్యతిరేకత
ఆస్ట్రేలియా తీసుకొచ్చిన ఈ కొత్త చట్టాన్ని కంపెనీల యాజమాన్య సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. హడావుడిగాఈ చట్టాన్ని తీసుకొచ్చారని విమర్శిస్తున్నాయి.
- ఉద్యోగి తిరస్కరణ అసమంజసమని పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు:
- యజమాని సంప్రదించడానికి కారణం
- ఆ కాంటాక్ట్‌ను ఎలా చేశారు? ఇది ఉద్యోగి వ్యక్తిగత పనికి ఎంత మేర విఘాతం కలిగించింది?
- ఉద్యోగి చేసిన అదనపు పని గంటలకు అదనపు చెల్లింపులు చేశారా?
- కంపెనీలో ఉద్యోగి పాత్ర, బాధ్యతల స్థాయి.
- ఉద్యోగికి ఉన్న కుటుంబ, వ్యక్తిగత బాధ్యతలు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

