సైనిక్ స్కూల్‌పై రేవంత్‌వి అబద్ధాలు
సైనిక్ స్కూల్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు.
- స్కూల్‌పై రక్షణశాఖ షరతులు
- నిర్వహించలేమని చేతులెత్తేసింది
- షరతులు సడలించాలని కేసీఆర్ లేఖ
- గోబెల్స్‌ను ఫాలో అవుతున్న రేవంత్
- మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఫైర్
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగా ణ): సైనిక్ స్కూల్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. సైనిక్ స్కూల్ కోసం గతంలో సీఎంగా కేసీఆర్, ఎంపీలుగా తాము అనేకమార్లు ప్రయత్నించినట్టు తెలిపారు. రక్షణశాఖ ఆధ్వర్యంలో సైనిక్ స్కూల్స్ ఇక ముందు నడపలేమని కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకోవడంతోనే సమస్యలు వచ్చాయని వివరించారు. సైనిక్ స్కూల్‌పై రేవంత్‌రెడ్డి గోబెల్స్ తరహాలో మాట్లాడారని మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో వినోద్‌కుమార్ మాట్లాడుతూ సైనిక్ సూల్ విషయాన్ని కేసీఆర్ పట్టించుకోలేదని మాట్లాడడం విడ్డూరంగా ఉం దని పేర్కొన్నారు.
కేంద్రానికి కేసీఆర్ రాసిన ఉత్తరాలు సీఎం కార్యాలయంలోనే ఉంటాయని, వాటిని రేవంత్ ఓసారి చూడాలని సూచించా రు. వరంగల్‌లో సైనిక్ సూల్కు సంబంధించి అప్పటి రక్షణమంత్రి మనోహర్ పారికర్‌ను అనేకసార్లు కలిశామని తెలిపారు. దివంగత అరుణ్ జైట్లీని కూడా బీఆర్ఎస్ ఎంపీలుగా చాలాసార్లు కలిశామని తెలిపారు. సైనిక్ సూల్కు భూమిసహా సిబ్బంది జీతభత్యాలు, రోజువారీ వ్య యం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని రక్షణశాఖ షరతులు విధిస్తే వాటిని సడలించాలని కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారని గుర్తుచేశారు.
నీట్‌పై రేవంత్ దృష్టిసారించాలి
నీట్ విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై రేవంత్‌రెడ్డి దృష్టిసారించాలని, మంచి న్యాయవాదిని నియమించి సుప్రీంకోర్టులో కొట్లాడాలని వినోద్‌కుమార్ సూచించారు. రాష్ట్రం నుంచి నీట్ రాసిన 1.4 లక్షలమంది తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యపై రేవంత్ అబద్ధాలు మాట్లాడి యువతను రెచ్చగొట్టారని, 2.2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ లింగయ్యయాదవ్, బీఆర్ఎస్ నాయకులు అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

