ఇంద్-భారత్ రుణాల్లో రూ.2 వేల కోట్ల స్కామ్.. ఈడీ, సీబీఐకి మాజీ ఐపీఎస్ పీవీ సునీల్‌కుమార్ ఫిర్యాదు
ఇంద్-భారత్ గ్రూప్ సంస్థలకు సంబంధించిన బ్యాంకు రుణాల వ్యవహారంలో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్ కోరారు.
- ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై ఆరోపణలు
- మనీలాండరింగ్ కోణంలో ఈసీఐఆర్ నమోదుకు విజ్ఞప్తి
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : ఇంద్-భారత్ గ్రూప్ సంస్థలకు సంబంధించిన బ్యాంకు రుణాల వ్యవహారంలో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్ కోరారు. ఈ గ్రూప్ ప్రమోటర్‌గా పేరొంటున్న ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజుపైనా సమగ్ర దర్యాప్తు జరుపాలని ఇటీవల ఈడీ డైరెక్టర్ రాహుల్ నవీన్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఇంద్-భారత్ గ్రూప్ సంస్థల నిర్వాకం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు మొత్తం రూ.2,011.72 కోట్ల నష్టం వాటిల్లినట్టు ఆరోపణలు ఉన్నాయని పేరొన్నారు. ఈ వ్యవహారాలపై ఇప్పటికే సీబీఐ నమోదు చేసిన కేసుల ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) నమోదు చేయాలని కోరారు. ఇదే కేసులో మరింత లోతుగా విచారణ చేపట్టాలని సీబీఐ డైరెక్టర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
అక్రమంగా రుణాలు మళ్లించారు
ఇంద్-భారత్ గ్రూప్ సంస్థలకు వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందించిన రుణాలకు సంబంధించిన మూడు కేసులను సునీల్ కుమార్ తన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ రుణాల వినియోగంపై నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లు, దర్యాప్తుల్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని, ఫిక్స్డ్ డిపాజిట్లు, ముందస్తు చెల్లింపులు, గ్రూప్ సంస్థల మధ్య నిధుల బదిలీల ద్వారా రుణ నిధులను పకదారి పట్టించారని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డ్రగ్స్ దందాలో సంపాదించిన ఆస్తుల జప్తు!
ఇంద్-భారత్ రుణాల్లో రూ.2 వేల కోట్ల స్కామ్.. ఈడీ, సీబీఐకి మాజీ ఐపీఎస్ పీవీ సునీల్‌కుమార్ ఫిర్యాదు
ఫ్యాకల్టీని ఇష్టారీతిన తొలగించొద్దు : ఉన్నత విద్యామండలి
ఆన్లైన్లో ప్రైవేట్ టీచర్లు, పిల్లల హాజరు మానిటరింగ్
తల్లిదండ్రుల వాట్సాప్‌నకు ఎస్ఏ-1 ప్రోగ్రెస్కార్డు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

