కాంగ్రెస్ పార్టీకి సుస్మితా దేవ్ రాజీనామా
కాంగ్రెస్ పార్టీకి సుస్మితా దేవ్ రాజీనామా | కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎంపీ, మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితా దేవ్ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖను

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎంపీ, మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితా దేవ్ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖను పంపారు. ఆమె రాజీనామాతో పార్టీకి ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సుస్మితా దేవ్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై అసోంలోని సిల్చార్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. తర్వాత ఆమెకు పార్టీ అధిష్ఠానం ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ బాధ్యతలు సైతం అప్పగించింది. అసోం శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత సుస్మితా దేవ్ రాజీనామా చేస్తుండడంతో కాంగ్రెస్‌కు మరింత ఇబ్బందికరంగా మారింది. రాజీనామాకు ముందు ఆమె వాట్సాప్ గ్రూప్‌ల నుంచి వైదొలిగారు. ఇటీవల ట్విట్టర్ కాంగ్రెస్ నేతలకు చెందిన అకౌంట్లు లాక్ చేయగా.. ఇందులో సుస్మితాదేబ్ అకౌంట్ కూడా ఉన్నది. ఇదిలా ఉండగా.. ఆమె తృణమూల్ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

