Ford Exit From India | ఐదో సంస్థగా ఫోర్డ్ నిష్క్రమణ.. 4000 మంది ఉపాధి హుళ్లక్కి?!
Ford Exit From India | ఫోర్డ్ తో భారత్ నుంచి ఐదు భారీ ఆటోమొబైల్స్ వైదొలిగినట్లయింది. దీంతో కంపెనీల రక్షణకు చట్టం తేవాలని ఫాడా డిమాండ్ చేసింది.

Ford Exit From India | గత నాలుగేండ్లలో భారత్ నుంచి నాలుగు ఆటోమొబైల్ కంపెనీలు వైదొలిగాయని ఆటోమొబైల్ డీలర్ సంఘాల సమాఖ్య (ఫాడా) ఆందోళన వ్యక్తం చేసింది. అకస్మాత్‌గా భారత్‌లో ఉత్పత్తి నిలిపేయాలని అమెరికా కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తున్నదని ఫాడా అధ్యక్షుడు వింకేశ్ గులాటీ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో భారత్ నుంచి వైదొలిగిన ఆటోమొబైల్ సంస్థల్లో ఫోర్డ్ ఇండియా ఐదోవదన్నారు.
ఫోర్డ్ ఇండియాకు ముందు జనరల్ మోటార్స్, మ్యాన్ ట్రక్స్, హార్లే డేవిడ్సన్, యూఎం లోహియా అనే అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీలు భారత్ నుంచి వైదొలిగాయి.
ప్రొటెక్షన్ చట్టం కోసం ఫాడా డిమాండ్
ఆటోమొబైల్ కంపెనీల ప్రయోజనాల పరిరక్షణకు ఫ్రాంచైజ్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని గురువారం ఓ ప్రకటనలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఉత్పత్తిదారుడికి ఎటువంటి చట్టపరమైన రక్షణ లేకపోవడంతో వారు ఎటువంటి పరిహారం పొందలేకపోతున్నారు. మెక్సికో, బ్రెజిల్, రష్యా, చైనా, ఇండోనేషియా, మలేషియా, జపాన్,ఇటలీ, ఆస్ట్రేలియా, స్వీడన్ సహా పలు దేశాల్లో ఈ తరహా చట్టాలు ఉన్నాయని ఫాడా గుర్తు చేసింది.
పరోక్షంగా 40 వేల మందిపై ప్రభావం
అకస్మాత్‌గా ఫోర్డ్ ఇండియా వైదొలగడంతో 4,000 మంది ఉద్యోగాలను కోల్పోతారు. పరోక్షంగా కంపెనీతో అనుసంధానమైన 40 వేల మంది ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఫాడా ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 391 ఔట్లెట్లు కల 170 మంది డీలర్లు రూ.2000 కోట్లు పెట్టుబడులు పెట్టారని గుర్తు చేశారు. కంపెనీ మూసివేత వల్ల డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. దీనికి సంబంధిత డీలర్లకు పరిహారం చెల్లించడానికి ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్ అనురాగ్ మల్హోత్రా అంగీకరించడం మంచి పరిణామం అని వింకేశ్ గులాటీ తెలిపారు.
డీలర్లకు భారీ ఆర్థిక నష్టం..
కొత్త డీలర్లను ఐదు నెలల క్రితమే కంపెనీ నియమించింది. కంపెనీ యాజమాన్యం తాజా నిర్ణయం వల్ల కొత్త డీలర్లు భారీగా ఆర్థిక నష్టాన్ని భరించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఫోర్డ్ ఇండియా డీలర్ల వద్ద ప్రస్తుతం 1000 కార్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటివరకు భారత్‌లో విక్రయించిన ఫోర్డ్ కార్ల సర్వీసింగ్ కోసం డీలర్లకు అండగా ఉంటామని అనురాగ్ మల్హోత్రా చెప్పారని వింకేశ్ గులాటీ పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి :
Tesla HatchBach Affordable| 2023లో చౌకగా హ్యాచ్‌బ్యాక్ టెస్లా కారు.. ధరెంతంటే?!
Ola vs Tesla | టెస్లాకు ముందే అమెరికాలోకి ఓలా స్కూటర్ ఎంట్రీ.. ?!
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- fada
- ford india
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

