Kidney health | మీ కిడ్నీలు సరిగ్గా పనిచేయాలంటే మీరు తీసుకునే ఆహారంలో ఇవి కచ్చితంగా ఉండాలి..!
Kidney health : మన దేహంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఒక భాగం. శరీరంలోని మలినాలను తొలగించి శుభ్రంగా ఉంచడంలో కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తాయి. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు మలినాలు తొలగిపోవాలి. మలినాలు తొలగిపోవాలంటే కిడ్నీల పనితీరు బాగుండాలి. లేదంటే శరీరం మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. మరి కడ్నీలు సమర్థంగా పనిచేయాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను మీ డైట్లో కచ్చితంగా చేర్చుకోవాల్సిందే. మరి అవేంటో తెలుసుకుందాం..
Kidney health : మన దేహంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఒక భాగం. శరీరంలోని మలినాలను తొలగించి శుభ్రంగా ఉంచడంలో కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తాయి. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు మలినాలు తొలగిపోవాలి. మలినాలు తొలగిపోవాలంటే కిడ్నీల పనితీరు బాగుండాలి. లేదంటే శరీరం మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. మరి కడ్నీలు సమర్థంగా పనిచేయాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను మీ డైట్లో కచ్చితంగా చేర్చుకోవాల్సిందే. మరి అవేంటో తెలుసుకుందాం..
1. వెల్లుల్లి
వెల్లుల్లిని మూత్రపిండాల రక్షణకు మంచి ఆహారంగా చెప్పవచ్చు. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ క్లాటింగ్ కణాలు ఉండటంవల్ల చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది.
2. మొలకెత్తిన విత్తనాలు
శనగలు, పెసర్లు లాంటి ధాన్యాలను తరచూ మొలకెత్తించి తినడంవల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిలోని ఫైబర్ శరీరంలోని మలినాలను తనతో కలుపుకుని విసర్జితమవుతుంది. అందువల్ల మూత్రపిండాలు శుభ్రపడి కిడ్నీల్లో రాళ్ల సమస్య రాకుండా ఉంటుంది.
3. క్యాబేజీ
క్యాబేజీ మూత్రపిండాల పనితీరును మెరుగుపర్చడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. సాధారణంగా క్యాబేజీని కిడ్నీల డ్యామేజ్‌ను అరికట్టే సహజ ఔషధంగా వినియోగిస్తారు.
4. ఉల్లిపాయ
ఉల్లిపాయలు కిడ్నీల్లో రాళ్లను తొలగించడానికి తోడ్పడుతాయి. అంతేగాక మూత్రపిండాలను నిర్విషీకరణ చేయడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి.
5. బెర్రీస్
బెర్రీస్ వివిధ రంగుల్లో లభ్యమవుతాయి. వాటిలో బ్లాక్‌బెర్రీ మినహా మిగతా అన్ని రకాల బెర్రీలు కిడ్నీలకు మేలు చేసేవే. స్ట్రాబెర్రీ, క్రాన్ బెర్రీస్, బ్లూబెర్రీస్ అన్నింటిలోనూ న్యూట్రియంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరి క్వాలిటీస్ సమృద్ధిగా ఉంటాయి. అందుకే అవి వ్యాధి నిరోధకతను పెంచి బ్లాడర్ ఫంక్షన్స్ సక్రమంగా ఉండేందుకు దోహదపడుతాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- berries
- cabbage
- garlic
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

