Nepal Floods | నేపాల్‌లో బుధవారం వరదలు (Floods) సంభవించాయి. ఈ వరదలు టిబెట్ నుంచి మొదలై నేపాల్‌లోకి పోటెత్తాయని నేపాల్ పోలీసులు, అధికారులు వెల్లడించారు. ఈ వరదల వల్ల నేపాల్‌లోని భోటె కోషి నది ఉప్పొంగి నువాకోట్, ధాడింగ్ జిల్లాలను ముంచెత్తింది. ఈ ఘటనలో 8 మంది చనిపోయారని, 105 మంది భారతీయులు సహా ఇతరులు గల్లంతయ్యారని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అభినారాయణ్ కఫ్లే వెల్లడించారు. సరిహద్దులోని టిబెట్ నుంచి నేపాల్‌లోకి ప్రవేశించిన వరద వల్ల అనేక గ్రామాలు కొట్టుకుపోయాయి.
వందల మంది గల్లంతు
ఈ వరదల వల్ల కనీసం 384 మంది యాత్రికులు గల్లంతయ్యారు (Missing). వీరిలో 291 మంది విదేశీయుల్లో 105 మంది భారతీయులు, 93 మంది నేపాలీయులు గల్లంతయ్యారని నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. రసువా జిల్లాలో కనీసం 26 మంది పోలీసులు సిబ్బంది గల్లంతయ్యారని సమాచారం. నేపాల్ సైన్యం హెలికాప్టర్లు, విపత్తు నివారణ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టింది. అలాగే జలవిద్యుత్ కేంద్రాలు దెబ్బతిన్నాయి.
సీసీటీవీ ఫుటేజ్
నేపాల్‌లో భారీ వరదలు.. 500 మందికి పైగా భారతీయులు గల్లంతు
చైనా–నేపాల్ సరిహద్దు ప్రాంతంలో భారీ వరదలు బీభత్సం సృష్టించడంతో 105 మంది భారతీయ పర్యాటకులు గల్లంతైనట్లు సమాచారం
కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన దాదాపు 400 మంది యాత్రికులు కూడా గల్లంతైనట్లు, వారు కూడా… https://t.co/01WiVlz7YM pic.twitter.com/f1TJYgFCp7
— Telugu Scribe (@TeluguScribe) August 26, 2026
పీఎం సమావేశం
నేపాల్ ప్రధాన మంత్రి బాలేంద్ర షా (Balendra Sha) నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంజ్ అథారిటీతో అత్యవసరం సమావేశం నిర్వహించారు. వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టేందుకు వైద్యులు, అధికారులను ఆదేశించారు.
జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసే రుతుపవన వర్షాల (Monsoon Rains) వల్ల దక్షిణాసియాలో తరచుగా వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలు సంభవిస్తున్నాయి. వాతావరణ మార్పులే వీటికి కారణమని సైంటిస్టులు చెబుతున్నారు.