ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ సరికొత్త మోటోరోలా 4K ఆండ్రాయిడ్ టీవీ స్టిక్‌ను భారత్‌లో విడుదల చేసింది. భారత్‌లో దీని ధర రూ. 3,999గా నిర్ణయించారు. ఆండ్రాయిడ్ టీవీలో HDR10, డాల్బీ ఆడియో ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ టీవీ 9పై ఓఎస్ ఆధారంగా ఇది పనిచేయనుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్, జీ5 పలు స్ట్రీమింగ్ యాప్‌లను సపోర్ట్ చేస్తుంది.
మార్చి 15 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా మోటోరోలా 4కే టీవీలు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. ఎంఐ బాక్స్ 4కే, అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4కేలతో పాటు ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యంతో విడుదలైన నోకియా, మార్క్యూ బ్రాండ్లకు మోటోరోలా టీవీ స్టిక్ గట్టిపోటీనివ్వనుంది.