Fire Accident | సీబీఐ కార్యాలయంలో అగ్నిప్రమాదం
Fire breaks out at CBI office building in Delhi | దేశ రాజధాని ఢిల్లీలోని లోధి రోడ్ ఉన్న సీబీఐ భవనంలో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం బేస్మెంట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అధికారులు అప్రతమత్తమై సిబ్బందిని భవనం నుంచి ఖాళీ చేయించారు. సమాచారం అందుకున్న

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని లోధి రోడ్ ఉన్న సీబీఐ భవనంలో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం బేస్మెంట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అధికారులు అప్రతమత్తమై సిబ్బందిని భవనం నుంచి ఖాళీ చేయించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎనిమిది ఫైరింజన్లను సంఘటనా స్థలానికి తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్యానెల్ బోర్డులో మంటలు చెలరేగాయని అగ్నిమాపక అధికారి తెలిపారు. మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో అగ్నిప్రమాదంపై సమాచారం వచ్చిందని, 2.30గంటల వరకు మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. అయితే, ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని వివరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

