Tripura : అభిషేక్ బెనర్జీ సహా ఐదుగురు టీఎంసీ నేతలపై ఎఫ్ఐఆర్
అభిషేక్ బెనర్జీ సహా ఐదుగురు టీఎంసీ నేతలపై ఎఫ్ఐఆర్ | టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, ఆ పార్టీకి చెందిన ఐదుగురు నేతలపై త్రిపుర పోలీసులు

అగర్తలా: టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, ఆ పార్టీకి చెందిన ఐదుగురు నేతలపై త్రిపుర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీస్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై అభిషేక్‌తో పాటు దోలా సేన్, బ్రత్య బసు, కునాల్ ఘోష్, సుబాల్ భౌమిక్, శ్రీ ప్రకాశ్ దాస్, ఇతర నేతలపై కేసులు నమోదయ్యాయి. అదనపు ఎస్పీ, ఎస్డీపీఓ ఖోవాయ్తో అనుచితంగా ప్రవర్తించినందుకు, విధులను నిర్వర్తిచకుండా అడ్డుకున్నందున ఎఫ్ఐఆర్ నమోదైంది. 2023 త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో అక్కడ పార్టీ పటిష్టం చేయాలని టీఎంసీ భావించింది.
ఈ క్రమంలో ఇటీవల అభిషేక్ బెనర్జీ ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న క్రమంలో.. ఆయన క్వానయ్పై కొందరు కర్రలు, లాఠీలతో దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన వెనుక హోం మంత్రి అమిత్ షా ప్రోద్బలం ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ‘హోం మంత్రి క్రియాశీలక మద్దతు లేకుండా ఇలాంటి దాడులు జరిగి ఉండేవి కావు. త్రిపుర రాష్ట్ర పోలీసులు ఎదుటే ఈ దాడి జరిగింది. కానీ పోలీసులు మౌన ప్రేక్షకులుగా ఉండిపోయారు. ఇలాంటి దాడిని ఆదేశించే ధైర్యం త్రిపుర ముఖ్యమంత్రికి లేదు’ అంటూ మమతా బెనర్జీ ఆరోపించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

