Mayookha | ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘మయూఖ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Mayookha | తక్కువ బడ్జెట్‌తో కూడా సంచలనం సృష్టించగలమని నిరూపించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘మయూఖ’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Mayookha | తక్కువ బడ్జెట్‌తో కూడా సంచలనం సృష్టించగలమని నిరూపించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘మయూఖ’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు శ్రీ తేజ్ SK దర్శకత్వం వహించారు. శశిధర్ నల్ల, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో మంచి ఆదరణ పొందడమే కాకుండా, న్యూయార్క్ మరియు కేన్స్ వేదికలపై అంతర్జాతీయ అవార్డులతో ప్రశంసలు అందుకుంది.
ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుండగా.. నవంబర్ 23 నుంచి తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు మరో ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌లో కూడా స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. పెళ్లి కాని యువతి మయూఖ ఒక బ్యాంకులో పనిచేస్తూ ఇన్సూరెన్స్ పాలసీలు చేస్తుంటుంది. నగరంలో ఒంటరిగా ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకుని వరుస హత్యలు జరుగుతుంటాయి. చిన్నతనంలో జరిగిన భయంకరమైన సంఘటనల వల్ల భయంతో బతికే మయూఖకు, తన గదిలో వింత సంఘటనలు ఎదురవుతాయి. ఆమె కూడా ఆ హత్యల జాబితాలో టార్గెట్ అవుతుందా, ఆ అదృశ్య శత్రువు నుండి ఆమె ఎలా బయటపడింది అనేదే ఈ మిస్టరీ థ్రిల్లర్ కథ.
Prime Video Link 🔗https://t.co/JFLz5iNuBp
#Mayookha Latest Telugu Horror Thriller Full Movie Streaming Now on @PrimeVideoIN🎬
#MayookhaFullMovie #MayookhaOnPrime #PayalChengappa #ShreeTejSK #DevD #MuralidharGoud #AmanMasud #JanuVarma #KLavanyaRani #NanajeeKarri #RamisettyRambabu #SrikanthKandragula #SashiKadiri #OTTRelease #CrimeThrillers #2026NewReleasedMovies #HorrorMovies #SuspenseThrillers #PrashvithaEntertai9ment #SriBalajiVideo
— Sri Balaji Video (@sribalajivideos) November 20, 2026
ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందనే దానిపై దర్శకుడు శ్రీ తేజ్ SK పంచుకున్న విషయాలు ఆసక్తిని పెంచుతున్నాయి. మొదటి భాగం మలయాళ సినిమా తరహాలో నెమ్మదిగా, స్లో-బర్న్గా సాగుతుందట. కానీ ప్రీ ఇంటర్వెల్ దగ్గర కథ కీలక మలుపు తిరుగుతుందని, అక్కడి నుంచి రెండో భాగం అనూహ్యమైన ట్విస్ట్‌లు, ఉత్కంఠతో పరుగులు తీస్తుందని దర్శకుడు తెలిపారు. అలాగే స్పానిష్, కొరియన్, హాలీవుడ్ చిత్రాల స్ఫూర్తితో రూపొందించిన మోనోక్రోమాటిక్ లైటింగ్ ఈ సినిమాకు ప్రత్యేకమైన విజువల్ ఫీల్‌ను ఇస్తుందట. ఓటీటీలో ‘మయూఖ’ చూసేవారికి దర్శకుడు ఓ స్పెషల్ అడ్వైజ్ కూడా ఇచ్చారు. సినిమాలోని సస్పెన్స్, సైకలాజికల్ ఎలిమెంట్స్ పూర్తిగా పండాలంటే మధ్యలో పాజ్ చేయకుండా, ఒకే సిట్టింగ్‌లో చూస్తేనే అసలైన మజా దొరుకుతుందని ఆయన సూచించారు. కొత్త తరహా థ్రిల్లర్ అనుభూతి కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్ అవుతుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mayookha | ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘మయూఖ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా ప్రారంభమైన సహస్రనామావళి సహిత కోటి పుష్పార్చన
Mysaa | 29 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన వందేమాతరం – సుద్దాల.. ‘మైసా’ నుంచి పవర్ఫుల్ విప్లవ గీతం నేడే!
IND vs NZ | కివీస్‌కు దీటుగా జవాబిస్తున్న టీమిండియా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి స్కోర్ ఎంతంటే..
NHRC | తెలంగాణలో ప్రభుత్వ దవాఖానల దుస్థితిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

