Huzurabad | టీఆర్ఎస్ పట్ల అభిమానం.. భద్రాచలం నుంచి వచ్చి హుజూరాబాద్‌లో ప్రచారం..

హూజూరాబాద్ : టీఆర్ఎస్ పార్టీమీద ఉన్న అభిమానం ప్రకాశ్‌ను భద్రాచలం నుంచి హుజూరాబాద్‌కు నడిపించింది. సైకిల్ కు జెండాలు కట్టుకుని హూజూరాబాద్ నియోజకవర్గంలోని గ్రామగ్రామాన తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. అలా అని ఆయన పార్టీలో లీడరేం కాదు సామాన్య కార్యకర్త. ఏమి ఆశించకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్నాడంటే ప్రకాశ్ కు టీఆర్ఎస్ పార్టీ పట్ల ఉన్న అభిమానం వెలకట్టలేనిది. ప్రకాశ్‌ను గురువారం మంత్రి హరీశ్‌రావు అభినందించారు.
జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు తిరిగి వెళ్లున్న క్రమంలో టీఆర్ఎస్ జెండాలతో వెళ్తున్న సైకిల్ కనిపించింది. వెంటనే వాహనాన్ని ఆపి సైకిల్‌పై వెళ్లున్న వ్యక్తిని పలుకరించాడు, తన పేరు ప్రకాశ్ అని తనది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని చెప్పాడు.
టీఆర్ఎస్ పార్టీపై ఉన్న అభిమానంతో ఇక్కడ ఉప ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి తన సైకిల్ కు టీఆర్ఎస్ జెండాలు కట్టుకుని, మైకు అమర్చుకుని గడచిన ఆరు నెలలుగా ప్రచారం చేస్తున్నానని చెప్పడంతో హరీశ్‌రావు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

