Farmers the hardworking humans | కష్టజీవులు-కర్షకులు!
Farmers the hardworking humans | కష్టజీవులు-కర్షకులు

బీడనకను పొలము బిత్తర పడకను
గుద్దలినిల జేత గుబురు నరికి
వాన జల్లు రాక వడిసి పట్టియు తాను
భూమి దున్నె రైతు భూవరుండు!
భుజము పైన దంతె భూమిని చదునుకు
బరువు నెంత యున్న బాగ మోసి
పొలము చక్కబరచి పొడువు గూర్చెడి
లక్షణంబు గల్గు లక్ష్యకుండు!
గొర్రు బట్టి దున్న కోమలి విత్తుచు
సాలు సాగి పోవు చల్లగాను
కోడె జంట తోడ కోర్కె లింపారగ
భూమి నిచ్చు హాయి భూరిపంట!
పంటలన్ని పండ పకపక నవ్వులు
తల్లి పిల్ల లంత తనివి తీర
కరువు లోన పడ్డ కష్టాలు మర్చియు
ఇంట వెలుగు పంట యింపు మీర!
కష్టజీవి బతుకు కడగండ్లు భరియించి
పరుల కొరకు తాను పాట్లు పడును
ప్రజల హితుడు బహుళ పారవశండును
పుడమి లోన వెల్గు పుణ్యజీవి!
కేంద్ర ప్రభుత జూడ కేలు పూర్తిగను సాచి
రైతుల వరిసస్య రాశి కొనగ
పూర్తి మద్దతిచ్చి పూనిక తోడుయై
నపుడు కర్షకుల మది హర్షమొందు!!

డాక్టర్ గన్నోజు శ్రీనివాసాచారి
85558 99493
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

