గొర్రెలకు మేతగా పత్తి పంట
పంట చేతికొచ్చే దశలో ఎండిపోవడంతో పశువుల మేతకు వదిలిపెట్టిన పరిస్థితి ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో చోటుచేసుకున్నది. చిన్నమల్యాలలో ఓ రైతు పత్తి పంట సాగు చేశాడు.
వేంసూరు, నవంబర్ 13 : పంట చేతికొచ్చే దశలో ఎండిపోవడంతో పశువుల మేతకు వదిలిపెట్టిన పరిస్థితి ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో చోటుచేసుకున్నది. చిన్నమల్యాలలో ఓ రైతు పత్తి పంట సాగు చేశాడు. వర్షాలు కురువకపోవడంతో పూత, కాత దశలో పంట ఎండిపోయింది.
కళ్లముందు ఎండిపోతున్న పంటను చూసి కలత చెందిన రైతు పశువుల మేతకు వదిలేయాల్సిన దుస్థితి నెలకొన్నది. కొందరు ఆయా పంట చేలల్లో పశువులు, గొర్రెలు, మేకలను మేపుతున్నారు. విద్యుత్తు, నీటి సదుపాయం లేకపోవడంతో పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. పంటకు ప్రభుత్వమే పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

