కేంద్ర మాజీ మంత్రి చమన్ లాల్ గుప్తా కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి చమన్ లాల్ గుప్తా కన్నుమూత | బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చమన్ లాల్ గుప్తా (87) మంగళవారం కన్నుమూశారు. ఆయన మే 5న కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు.

శ్రీనగర్ : బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చమన్ లాల్ గుప్తా (87) మంగళవారం కన్నుమూశారు. ఆయన మే 5న కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. నారాయణ ఆసుపత్రిలో విజయవంతంగా కోలుకొని గాంధీనగర్‌లోని ఇంటికి ఆదివారం చేరారు. మంగళవారం ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించి ఉదయం తుది శ్వాస విడిచారని ఆయన కుటుంబీకులు తెలిపారు. గుప్తాకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఏప్రిల్ 13, 1934న జమ్మూలో జన్మించిన ఆయన.. గత రెండేళ్ల కిందట వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ రాజకీయాలకు దూరమయ్యారు. చమన్ లాల్ గుప్తా 1972లో మొదటిసారిగా జేఅండ్‌కే లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికవగా.. ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది.
2008, 2014 మధ్య జమ్మూకాశ్మీర్ శాసన సభ్యుడిగానూ ఎన్నికయ్యారు. 1996లో జమ్మూ ఉధంపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పొందారు. 1998, 1999లోనూ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు. చమలాల్ గుప్తా 1999లో కొద్ది నెలలు పౌర విమానయాన మంత్రిత్వశాఖ బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఆహార శుద్ధి, పరిశ్రమలు, కేంద్ర రక్షణ సహాయ మంత్రిగానూ సేవలందించారు. బీజేపీ జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పని చేసిన ఆయన.. జీఎం సైన్స్ కళాశాల జమ్మూ, అలహాబాద్ విశ్వవిద్యాలయం (యూపీ) నుంచి ఎంఎస్సీ పూర్తి చేశారు. చమన్ గుప్తా మరణంపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సంతాపం ప్రకటించారు. ఆయన మరణం రాజకీయ రంగానికి తీరని లోటని కార్యాలయం ట్వీట్ చేసింది. ప్రజా సంక్షేమానికి చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండి పోతుందన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

