దేవరుప్పుల, జూన్ 24: అమెరికా మేరీల్యాండ్‌లోని బాల్టీమోర్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 31నుంచి ఆగస్టు 2 వరకు జరిగే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) 19వ మహాసభలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెళ్లారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలకు ప్రవాస తెలంగాణవాసులు ఆయనను మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. మహాసభల్లో జరుగనున్న బిజినెస్ అండ్ మెగా ఈవెంట్స్, కల్చరల్ ప్రోగ్రాంలు, యూత్ ఫోరం యాక్టివిటీస్‌కు సంబంధించి బుధవారం డల్లాస్‌లో ఆటా ప్రెసిడెంట్ సతీశ్‌రెడ్డి, తానా వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ తోటకూరితో ఎర్రబెల్లి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సమావేశమై చర్చించారు.
అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఈ మహాసభల్లో ఆటా, తానా తెలంగాణ ప్రజలకు సేవలందించేలా నిర్ణయాలు తీసుకోవాలని, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని సూచించారు. అమెరికాలోని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ విద్యార్థులకు మార్గదర్శకత్వం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పలు ఐటీ కంపెనీల సీఈవోలతోపాటు పీఎంజే జ్యువెలరీ చైర్మన్ కుశాల్ జీ, పోకర్న్ గ్రానైట్ చైర్మన్ గౌతమ్ జీ, ఆటోఫిన్ గౌతమ్ పాల్గొన్నారు.