ప్రభుత్వ పరంగా కబడ్డీకి ప్రోత్సాహం : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

మహబూబాబాద్ : కబడ్డీ గ్రామీణ క్రీడ. గతంలో కబడ్డీకి యమా క్రేజీ ఉండేది. ఈ ఆటను బాగా ప్రోత్సహించాలి. ప్రభుత్వ పరంగా కబడ్డీని ప్రొత్సహించే విధంగా సీఎం కేసీఆర్‌తో మాట్లాడనున్నట్లు రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో గత నాలుగు రోజులుగా నిర్వహించిన 47వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు ముగిశాయి. మొత్తం 500 మంది బాలబాలికల క్రీడాకారులు వివిధ రకాల పోటీల్లో పాల్గొన్నారు. ముగింపు ఉత్సవాలకు మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.
స్వతహాగా కబడ్డీ ప్లేయర్ అయిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో కబడ్డీ పోటీలు నిర్వహించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అంతా కలిసి కబడ్డీకి పూర్వ వైభవం తెద్దామన్నారు. కోచింగ్ క్యాంప్ నిర్వహణకు కూడా సాయంగా ఉంటానన్నారు. స్థానికంగా ప్రజా ప్రతినిధులు క్రీడా నిర్వాహకులకు సహకరించాలన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

