ఒక్క ట్వీట్.. లక్ష కోట్లు ఫట్
మస్క్‌కు బిట్‌కాయిన్ సెగ.. ప్రపంచ కుబేరుడి హోదా దూరం

క్యాలిఫోర్నియా, ఫిబ్రవరి 23: బిట్‌కాయిన్ గురించి మాట్లాడిన ఒక్కమాట.. అమెరికా విద్యుత్ ఆధారిత వాహన తయారీ దిగ్గజం టెస్లా అధిపతి ఎలన్ మస్క్‌ను ప్రపంచ కుబేరుడి స్థానం నుంచి దింపేసింది. క్రిప్టోకరెన్సీలు బిట్‌కాయిన్, ఎథర్ విలువ ఎక్కువగా ఉందంటూ మస్క్ చేసిన ట్వీట్.. ఆయన సంపదను ఒక్కరోజే ఏకంగా 15.2 బిలియన్ డాలర్లు (రూ.1,10,108 కోట్లు) దిగజార్చింది. సోమవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో టెస్లా షేర్లు 8.6 శాతం మేర నష్టపోయాయి మరి. దీంతో బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రపంచ టాప్-500 జాబితాలో మస్క్ రెండో స్థానానికి పడిపోయారు. 186.3 బిలియన్ డాలర్లతో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అగ్రస్థానంలో ఉండగా, మస్క్ సంపద 183.4 బిలియన్ డాలర్లకే పరిమితమైంది. నిజానికి బెజోస్ సంపద కూడా 3.7 బిలియన్ డాలర్లు పతనమైంది. అయినప్పటికీ టాప్‌లో నిలిచారు. బిట్‌కాయిన్‌పై పెట్టుబడులతో మస్క్ సంపద ఇటీవలికాలంలో భారీగా పెరుగగా, ఇప్పుడు అదే కాయిన్ కొంపముంచింది. మరోవైపు బిట్‌కాయిన్ విలువ కూడా పతనమైంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Elon Musk
- World Richest
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

