Form 6 | ఫామ్ 6లో జరిగిన మార్పులేంటి? ఇద్దరు ఎన్నికల కమిషనర్లకున్న అభ్యంతరాలేమిటి?
కొత్త ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం ఉపయోగించే ఫామ్ 6కు చెందిన ఆన్లైన్ వెర్షన్ ఈసీఐనెట్‌లో చేసిన మార్పులపై తీవ్ర వివాదం చెలరేగింది. ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరైన సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి మధ్య అభ్యంతరాలు, భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు వార్తలు రావడంతో ఈ వివాదం ముదిరింది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ మార్పులను చట్టవిరుద్ధం, అనధికారికంగా అభివర్ణిస్తున్నారు.
- ఇద్దరు ఎన్నికల కమిషనర్లకున్న అభ్యంతరాలేమిటి?
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: కొత్త ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం ఉపయోగించే ఫామ్ 6కు చెందిన ఆన్లైన్ వెర్షన్ ఈసీఐనెట్‌లో చేసిన మార్పులపై తీవ్ర వివాదం చెలరేగింది. ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరైన సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి మధ్య అభ్యంతరాలు, భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు వార్తలు రావడంతో ఈ వివాదం ముదిరింది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ మార్పులను చట్టవిరుద్ధం, అనధికారికంగా అభివర్ణిస్తున్నారు.
ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవడానికి పూరించే ఫామ్ 6లో చేసిన మార్పులకు సంబంధించి ప్రధాన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఫామ్ 6కు ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియతో అనుసంధానించిన ఒక కొత్త డిక్లరేషన్(స్వీయ ధృవీకరణ) విభాగాన్ని జోడించారు. ఈ కొత్త మార్పులో భాగంగా ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు, కొత్త దరఖాస్తుదారులను ఓటర్ల జాబితాలోకి వారి తల్లిదండ్రులు లేదా తాతాబామ్మల పేర్లకు సంబంధించిన మూడు ప్రశ్నలు అడిగారు. అందులోని ఒక ఎంపికను ఎంచుకోమని వారిని కోరారు.
మూడు ప్రశ్నలు
2000ల దశకం ప్రారంభంలో నిర్వహించిన సర్ సమయంలో వారి సొంత పేరు ఓటర్ల జాబితాలో ఉందా అనేది మొదటి ప్రశ్న. వారి తల్లిదండ్రులు లేదా తాతాబామ్మల పేర్లు ఆ పాత జాబితాలో ఉన్నాయా అనేది రెండవ ప్రశ్న. తమ పేర్లు గానీ, తమ తల్లిదండ్రుల పేర్లు గానీ ఆ జాబితాలో లేకపోతే ఏమవుతుందని మూడవ ప్రశ్న. ఈ ప్రశ్న తప్పనిసరి కాదు(నాన్ మాండేటరీ) అని పేర్కొన్నప్పటికీ ఆ డిక్లరేషన్‌కు సమాధానం ఇవ్వకుండా పోర్టల్‌లో ఫారమ్‌ను సమర్పించడం సాధ్యం కాదు. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పలు చట్టపరమైన అభ్యంతరాలను లేవనెత్తి, ఈ మార్పులపై తమ అసమ్మతిని వ్యక్తం చేసినట్టు సమాచారం. చట్టపరమైన, ఆచరణాత్మక అభ్యంతరాలు ఈ మార్పును నిర్దేశిత చట్టపరమైన ప్రక్రియ ఉల్లంఘనగా పేర్కొంటూ దీనిని అనధికారిక మార్పుగా అభివర్ణించాయి.
ఫామ్ 6 అనేది ఓటర్ల నమోదు నియమావళి 1960 ప్రకారం నిర్దేశించబడిన ఒక చట్టబద్ధమైన ఫామ్ అని ఎన్నికల కమిషనర్లు వాదించారు. ఆ నియమాలలో ఫామ్‌లో ఏదైనా మార్పు చేయాలంటే న్యాయ శాఖ నుంచి నోటిఫికేషన్, అధికారిక సవరణ అవసరం. కేవలం తమ స్థాయిలో ఒక ఉత్తర్వు లేదా మార్గదర్శకాన్ని జారీ చేయడం ద్వారా కమిషన్ దానిని మార్చలేదన్నది వారి వాదన. అనధీకృత ప్రకటనలు యువతకు, మొదటిసారి ఓటు వేసేవారికి ఇబ్బందులను కలిగించవచ్చు. వారు తమ ఓటు హక్కును కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది.
ఈ మార్పు కొత్త ఓటర్లపై పలు విధాలుగా ప్రభావం చూపుతుంది. 2002 నాటి సవరణ సమయంలో తమ కుటుంబాలు ఓటర్ల జాబితాలో లేకపోయినా లేదా ఏదైనా కారణం చేత పేర్లు తొలగించినా అటువంటి వారు తరాల తరబడి కొనసాగే సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫామ్ 6తోపాటు దేశంలోని డిజిటల్ ఎన్నికల డాటాబేస్లైన ఈసీఐనెట్, ఈఆర్వోనెట్ల నియంత్రణ ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం వద్ద కేంద్రీకృతమై ఉండటంపై కూడా ఎన్నికల కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి అధికారులు లేదా ఎన్నికల నమోదు అధికారులు(ఈఆర్వోలు) తమ విధులను నిర్వహించడానికి అవసరమైన పూర్తి స్థాయి వెసులుబాటును, స్వేచ్ఛను పొందకుండా ఇది అడ్డుకుంటున్నదని వారు వాదించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

