సీసం : ఆధ్యాత్మికమున మీ ఆసక్తి యెట్టిదో
యాదాద్రియౌను ప్రత్యక్ష సాక్షి
పాలన పట్ల మీ పట్టుదలెట్టిదో
ప్రజల స్పందన యౌను ప్రబల సాక్షి
మహిళల పట్ల మీ మాన్యత మెట్టిదో
వనితల గొప్ప దీవెనలె సాక్షి
మాతృభాష యెడు మీ మక్కువ యెట్టిదో
చాల చక్కని తెల్గు సభలె సాక్షి
తే.గీ : ఆర్య! ఓ కల్వకుంట్ల మా ఆత్మవీవు
మీదు పాలన జూచి సమ్మోదమంది
గర్వపడుచున్నదీ తెలగాణమంత
అందుకోవయ్య హార్దిక వందనమ్ము !.
-డాక్టర్ కూరెళ్ళ
విఠలాచార్య